ఐదు నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌..!

మనం అర్జంటుగా బయటకు వెళ్లాలి.. చేతిలోనేమో పవర్‌ బ్యాంక్‌ లేదు.. ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టేందుకు తగిన సమయం...

Updated : 10 Mar 2021 15:46 IST

200W ఫాస్ట్‌‌ ఛార్జర్‌ను తెచ్చేందుకు షావోమీ ప్రయత్నం

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనం అర్జెంటుగా బయటకు వెళ్లాలి.. చేతిలోనేమో పవర్‌ బ్యాంక్‌ లేదు.. ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టేందుకు తగిన సమయం, కేబుల్స్‌, ప్లగ్‌లు లేవు. మరి అలాంటప్పుడు ఏం చేస్తాం.. ఎంతోకొంతసేపైనా వేచి ఉండి ఇంట్లోనే ఛార్జింగ్‌ పెట్టుకుని వెళ్లేందుకే మొగ్గు చూపుతాం. ప్రస్తుతం మొబైల్‌ ఫోన్‌ ఛార్జ్ కావాలంటే ఛార్జర్‌ను బట్టి అరగంట నుంచి దాదాపు రెండు గంటల వరకు పట్టే అవకాశం ఉంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌తోపాటు కొత్తగా ఎయిర్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. ఎంఐ తీసుకొచ్చిన ఎయిర్‌ ఛార్జర్‌ ద్వారా కేవలం ఇరవై నిమిషాల్లోనే ఎనభై శాతం వరకు ఛార్జ్‌ చేయవచ్చు.

ఎయిర్‌ ఛార్జర్‌ టెక్నాలజీతో ఫోన్ ఛార్జర్‌కు కనెక్ట్‌ చేయకుండా దూరం నుంచి ఛార్జ్‌ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి కేబుల్స్, ఛార్జింగ్ స్టాండ్ అవసరం లేదు.  దీని సహాయంతో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లను ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఇప్పుడు 200W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో కూడిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలని షావోమీ సమాయత్తమైంది. దీని ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌ చేయవచ్చని ఆ కంపెనీ పేర్కొంది. అయితే ఇది ఇక్కడ కాదండి.. తొలుత చైనాలో విడుదల చేయనుంది. ఇంకా భారత్‌లోకి ఎప్పుడు తెస్తారనేది సంస్థ ప్రకటన వెలువరించలేదు. మరోవైపు రియల్‌మీ 125W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీని కమర్షియల్‌గా తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 120W ఛార్జర్‌ను వివో iqoo 7 విడుదల చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని