జూమ్‌లో మాటలు..ఇక టెక్ట్స్‌ రూపంలో.. 

వీడియో కాలింగ్ యాప్ జూమ్‌ సాధారణ యూజర్స్ కోసం మరో ఫీచర్‌ను తీసుకొచ్చింది. గతంలో సబ్‌స్క్రైబర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉన్న ‘లైవ్‌ ట్రాన్‌స్క్రిప్షన్’ ఫీచర్‌ను ఇక మీదట సాధారణ యూజర్స్ కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

Published : 01 Mar 2021 11:24 IST

 

ఇంటర్నెట్ డెస్క్‌: వీడియో కాలింగ్ యాప్ జూమ్‌ సాధారణ యూజర్స్ (ఫ్రీ యూజర్స్) కోసం మరో ఫీచర్‌ను తీసుకొచ్చింది. గతంలో సబ్‌స్క్రైబర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉన్న ‘లైవ్‌ ట్రాన్‌స్క్రిప్షన్’ ఫీచర్‌ను ఇక మీదట సాధారణ యూజర్స్ కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ ఫీచర్‌ ఏఐ ఆధారంగా పనిచేస్తుంది. దీని సాయంతో సమావేశాల మధ్యలో మాటలను అక్షరాల రూపంలోకి మార్చుకోవచ్చు. ఈ ఏడాది చివరికి ఈ ఫీచర్‌ సాధారణ యూజర్స్‌కి అందుబాటులోకి రానుంది. దానికంటే ముందుగా ఈ ఫీచర్ ఉపయోగించాలనుకునేవారు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుంటే యాక్సెస్ లభిస్తుందని తెలిపారు. 

ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడానికి జూమ్ ఐడీతో లాగిన్‌ అయిన తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీటింగ్‌పై క్లిక్ చేయాలి. అందులో క్లోజ్‌డ్ క్యాప్షన్ ఓపెన్ చేస్తే, మీరు ఈ ఫీచర్‌ కోసం జూమ్‌ గ్రూప్‌ లేదా అకౌంట్ అడ్మిన్ అనుమతి తీసుకోవాలని చూపిస్తుంది. అందులో ఎనేబుల్ లైవ్ సర్వీసెస్‌ను ఎంపిక చేస్తే సరిపోతుంది. తర్వాత జూమ్‌ మీటింగ్‌ జరిగేప్పుడు కాల్ కంట్రోల్స్‌లో క్లోజ్‌డ్ క్యాప్షన్ లేదా లైవ్ ట్రాన్‌స్క్రిప్షన్ అనే ఫీచర్ కనిపిస్తుంది. అందులో ఎనేబుల్ ఆటో- ట్రాన్‌స్క్రిప్షన్ ఫీచర్ సెలెక్ట్ చేస్తే చాలు. తర్వాత సమావేశంలో జరిగే మాటలను గుర్తించి స్క్రీన్‌ మీద టెక్ట్స్‌ రూపంలో టైప్ చేస్తుంది. అయితే ఒక్కొసారి ఈ టెక్ట్స్‌ పూర్తిస్థాయి కచ్చితత్వంతో ఉండకపోవచ్చని తెలిపింది. బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలు, మాట్లాడే వ్యక్తుల ఉచ్ఛారణ వల్ల కొన్నిసార్లు తప్పులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంగ్ల భాషను మాత్రమే టెక్ట్స్‌ రూపంలో టైప్ చెయ్యగలదు. త్వరలో మరిన్ని భాషలకు ఈ సేవలను విస్తరించనున్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని