Zoom: ఎక్కడెక్కడ ఉన్నా ఒకేచోట ఉన్నట్లు
గ్రూప్ కాల్స్/కాన్ఫరెన్స్ కోసం Immersive view తీసుకొచ్చిన జూమ్...
ఇంటర్నెట్ డెస్క్: ఆఫీసు మీటింగ్, కంపెనీ సెమీనార్లు, స్కూలు పాఠాలు... ఇవన్నీ ఇప్పుడు ఆన్లైన్లో సాగిపోతున్నాయి. కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్లో వర్చువల్‌గా మీటింగ్‌లు నిర్వహించేస్తున్నారు. అయితే ఎక్కడో ఏదో చిన్న వెలితి. మీటింగ్‌లో సెమినార్ చెప్పే వక్తలు పక్కపక్కన కూర్చుంటే బాగుంటుంది కదా. క్లాస్ రూమ్‌లో పిల్లలు హాలు మొత్తం కూర్చున్నట్లు ఉంటే బాగుండు కదా! ఇదేదో బ్లాక్స్‌లో ముక్కలు ముక్కలుగా కనిపిస్తున్నారు. అయితే త్వరలో ఈ ఇబ్బంది ఉండదు. ఇమ్మెర్సివ్ వ్యూ పేరుతో జూమ్కొత్త ఆప్షన్‌ను తీసుకొస్తోంది. ఆ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే... పైన ఫొటోలు కనిపించినట్లుగా అందరూ ఇలా పక్కపక్కన చేరిపోతారు. లేదంటే కింది ఫొటో తరహాలో గదిలో కూర్చున్నట్లు ఉంటారు.
జూమ్‌లో మాట్లాడుతున్న వ్యక్తి బ్యాగ్రౌండ్ మార్చుకోవచ్చనే విషయం మీకు తెలిసిందే. మీకు నచ్చిన ఇమేజ్/ జూమ్ ఇచ్చిన డీఫాల్ట్ ఇమేజ్‌లను వర్చువల్ బ్యాగ్రౌండ్‌గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ ఆప్షన్‌ను ఇంకాస్త మెరుగుపరుస్తూ ఇమ్మెర్సివ్ వ్యూను తీసుకొస్తోంది. ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే ఒక గదిలో ఐదారు స్థానాలు కనిపిస్తాయి. అందులో టేబుల్ దగ్గర (పైన ఒకటో ఫొటోలో ఉన్నట్లు) సమావేశంలో కూర్చున్నట్లుగా అడ్జెస్ట్ చేయొచ్చు. అవసరమైతే బ్యాగ్రౌండ్‌ను కూడా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. మొత్తం సెటప్‌ను క్లాస్ రూమ్‌గా మార్చేయాలన్నా, రెస్టరెంట్గా చూపించాలన్నా వీలవుతుంది. అయితే ఈ మార్పులు, ఫీచర్ కేవలం హోస్ట్‌కు మాత్రమే వీలవుతాయి. గరిష్ఠంగా 24 మంది పార్టిసిపెంట్స్ వరకే ఇమ్మెర్సివ్ వ్యూ పని చేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ విదేశాల్లో కొంతమందికి అందుబాటులో ఉంది. త్వరలో మన దేశంలోనూ లైవ్‌లోకి తీసుకొస్తారు. అన్నట్లు ఈ ఫీచర్ ప్రస్తుతానికి జూమ్ డెస్క్ టాప్ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. మొబైల్‌కు ఎప్పుడు తీసుకొస్తారో తెలియాల్సి ఉంది. అయితే ఇదే తరహా ఫీచర్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉంది. అక్కడ దానికి ‘టుగెదర్ మోడ్’ అని పిలుస్తారు.
* జూమ్ డెస్క్‌టాప్ యాప్‌లో కాల్ / కాన్ఫరెన్స్ కనెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత రైట్ సైడ్ టాప్ కార్నర్లో వ్యూ ఆప్షన్ వస్తుంది. అందులో స్పీకర్ వ్యూ, గ్యాలరీ వ్యూ, ఇమ్మెర్సివ్ వ్యూ అని వస్తుంది. అందులోంచి ఇమ్మెర్సివ్ వ్యూ ఎంచుకోవాలి.
* ఇమ్మెర్సివ్ వ్యూ ఎంచుకున్నాక కొన్ని లే అవుట్లో మీటింగ్ పార్టిసిపెంట్స్‌ను అడ్జెస్ట్ చేసుకోవాలి. ముందుగా చెప్పినట్లు 25 మంది వరకే ఈ ఆప్షన్ పని చేస్తుంది.
* ఈ ఫీచర్ పని చేయాలంటే కాల్/కాన్ఫరెన్స్‌లో ఉన్న యూజర్లందరూ కొత్త వెర్షన్ జూమ్ యాప్‌ను వాడుతుండాలి.
* కాల్/కాన్ఫరెన్స్‌లో 25 మంది కంటే ఎక్కువమంది ఉంటే... మిగిలినవాళ్లు థంబ్‌నైల్ వ్యూలో సైడ్‌కి కనిపిస్తారు.
* ఇమ్మెర్సివ్ వ్యూలో ఉన్నప్పుడు కాల్ రికార్డింగ్ ఆప్షన్ పని చేయదు. అంటే రికార్డు అవుతుంది కానీ.. ఆ వీడియో గ్యాలరీ వ్యూ, లేదా స్పీకర్ లే అవుట్లో కనిపిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్‌జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్‌ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్‌ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
నిర్ణీత సమయానికి ఎస్ఎంఎస్
ఆత్మీయుల పుట్టినరోజు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఎస్ఎంఎస్ పంపించాలని అనుకుంటాం. కానీ అప్పటివరకూ మెలకువగా ఉండకపోతే? నిద్రపోయినప్పుడు ఆ సమయానికి మెలకువ రాకపోతే? ఇలాంటి సమయాల్లోనే నిర్ణీత సమయానికి మెసేజ్‌లు అందే సదుపాయం ఉంటే బాగుండునని అనిపిస్తుంటుంది. -
వాట్సప్ కొత్త ఇమేజ్ ఎడిటర్
వాట్సప్ త్వరలో ఏఐ ఆధారిత కొత్త ఇమేజ్ టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఫొటోలను తేలికగా ఎడిట్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇమేజ్‌లను షేర్ చేసుకునే పేజీలో పైన కనిపిస్తుందని చెబుతున్నారు. -
ఏఐ వీడియోకు సౌండ్ ట్రాక్ సొబగులూ
ఏఐతో వీడియోలు సృష్టించటం తేలికైపోయింది. ఎలాంటి వీడియో కావాలో పదాల్లో వర్ణిస్తే చాలు. దానికి తగ్గట్టుగా వీడియోలు రూపొందించే ఏఐ వేదికలు చాలానే ఉన్నాయి. -
వాట్సప్‌లో మరిన్ని మెసేజ్‌లు పిన్
వాట్సప్ ప్రియులకు శుభవార్త. ఇకపై ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్, మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లలో భాగంగా వాట్సప్ దీన్ని ఇటీవలే పరిచయం చేసింది. -
మీ అభ్యర్థి చరిత్రేంటి?
మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్ క్యాండిడేేట్’ (కేవైసీ) యాప్‌లో చూసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు -
గేమింగ్‌లో కృత్రిమ నేస్తం!
ఎక్కడికి, ఎలా దారితీస్తుందో తెలియదు గానీ కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడే ఏఐ రోబో, పూర్తిస్థాయి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆవిష్కరణ ఆశ్చర్యచకితులను చేస్తే.. తాజాగా ఏఐ గేమింగ్ ఏజెంట్ పుట్టుకొచ్చింది -
ఏఐ పాట
కృత్రిమమేధ (ఏఐ) సాయంతో కొత్త పాటలను సృష్టించాలని అనుకుంటున్నారా? అయితే సునో ఏఐ (https://www.suno.ai/) సాయం తీసుకోండి. ఇదో ఏఐ మ్యూజిక్ జనరేటర్ వేదిక. -
డ్యూగూ.. సూర్యుడికే అన్న!
డ్యూగూ గ్రహ శకలం సూర్యుడి కన్నా ముందే పుట్టిందా? దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది. ఇప్పుడిదే ఆశ్చర్యం కలిగిస్తోంది. -
గూగుల్ లెన్స్‌లో సెర్చ్ హిస్టరీ సేవ్
గూగుల్ లెన్స్‌తో ఇమేజ్‌లను వెతికేవారికి శుభవార్త. ఇకపై వెతికిన ఇమేజ్‌లను తేలికగా తెలుసుకోవచ్చు. అవసరమైతే అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
నిర్ధరణ తీరునూ వివరించే ఏఐ
వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ విస్తరిస్తోంది. జబ్బుల నిర్ధరణ దగ్గరి నుంచి చికిత్సలను నిర్ణయించుకోవటం వరకూ ఉపయోగపడుతుంది. -
ఫైల్స్‌లో స్కాన్!
డాక్యుమెంట్లు, ఫైళ్లను ఒకదగ్గర నిల్వ చేసుకోవటానికి, తేలికగా షేర్ చేయటానికి గూగుల్ ఫైల్స్ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి కొత్తగా స్కాన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. -
డాక్స్‌లో పాత వర్షన్ కావాలంటే?
గూగుల్ డాక్స్‌లో ఎడిటింగ్ చేస్తూనే ఉంటాం. షేర్ చేసిన ఫైళ్లలో ఎవరెవరో ఏవో మార్పులు చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ముందరి డాక్యుమెంట్‌లోని సమాచారమే బాగుందని అనిపించొచ్చు. -
టాయ్‌లెట్ ఎక్కడ?
బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్ టాయ్లెట్ల విషయంలో మహిళలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. పట్ణణాల్లోనైతే ఈ సమస్య మరీ ఎక్కువ. -
ఫ్లాష్ నోటిఫికేషన్లు ఇలా..
ఫోన్ సైలెంట్లో పెట్టారు. కానీ ముఖ్యమైన నోటిఫికేషన్లు మిస్ అవుతున్నామేమో అని మనసులో అనిపిస్తుంటుంది. అంతలా బాధపడాల్సిన పనిలేకుండా ఫ్లాష్ లైట్ అలర్ట్‌ను సెట్ చేసుకుంటే చాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్‌గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప