Windows 11: విండోస్‌ 11లో ఈ ఫీచర్ల గురించి తెలుసా?

విండోస్‌ 11లో  ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్లేంటో, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందామా..

Updated : 01 Mar 2022 14:44 IST

మైక్రోసాఫ్ట్‌ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌) విండోస్ 11ను గతేడాది అక్టోబరులో అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, విండోస్‌ 11లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వస్తోంది. మరి విండోస్‌ 11లో  కొత్త ఫీచర్లేంటో, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందామా..


 టాస్క్‌బార్‌లో కొత్తగా..

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 11 వెర్షన్‌లో కొత్తగా లొకేషన్‌ ఆధారంగా వాతావరణ సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనిపై క్లిక్‌ చేయగానే వాతావరణ వివరాలను తెలిపే విడ్జెట్‌ ప్యానెల్‌ ఓపెన్‌ అవుతోంది. ఈ ఫీచర్‌ ఎనెబుల్‌ చేసుకోవాలంటే..

టాస్క్‌బార్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వెథర్‌ విడ్జెట్స్‌ (Weather Widgets)ను ఎనెబుల్‌ చేసుకోగానే వాతావరణ సమాచారం టాస్క్‌బార్‌లో ప్రత్యక్షం అవుతోంది. 


 మైక్‌ను మ్యూట్‌/అన్‌మ్యూట్‌ చేసుకొండిలా..

విండోస్‌ 11 అప్‌గ్రేడ్‌ అయిన సిస్టమ్స్‌లో టాస్క్‌బార్‌లో కుడి పక్కగా ఉన్న మైక్‌ను మ్యూట్‌/అన్‌మ్యూట్‌ చేసుకోవడానికి ఇక ప్రత్యేకంగా దాన్ని ఓపెన్‌ చేయాల్సిన పనిలేదు. దీనికోసం ఒక షార్ట్‌ కట్‌ కీ  “Windows + Alt + K” ని కూడా తీసుకొచ్చింది. దీంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మైక్‌ను మ్యూట్‌/అన్‌మ్యూట్‌ చేసుకోవచ్చు.


 వాయిస్‌ టైపింగ్‌..

మనం టైప్‌ చేసే అవసరం లేకుండా విండోస్‌లో వాయిస్‌ టైపింగ్‌ ఫీచర్‌ ఉన్న విషయం తెలిసిందే. దీంతో మనం చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా వాయిస్‌ రూపకంగా చెప్పొచ్చు. దీనికోసం షార్ట్‌ కట్‌ కీ “Windows + H” నొక్కగానే వాయిస్‌ టైపింగ్‌ కమాండ్‌ ఓపెన్‌ అవుతోంది.


 

​​ పాత కాంటెక్ట్స్‌ మెనూ కావాలా?

విండోస్‌ 10 నుంచి విండోస్‌ 11 వెర్షన్‌కు అప్‌గ్రేడ్‌ అయినట్లయితే పాత కాంటెక్ట్స్‌ మెనూలో మార్పులు జరుగుతాయి. దీంతో కొన్ని సెట్టింగ్స్ పోయాయని కొందరు భావిస్తారు. ఇక ఎప్పటిలాగే వాటిని మరలా యాక్సెస్ చేసుకునేలా విండోస్ 11 ఓఎస్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. దీనికోసం చిన్న ట్రిక్‌ ఉపయోగించాల్సి ఉంటుంది. కాంటెక్ట్స్‌ మెనూలో డబుల్‌ క్లిక్‌ చేసి “Show More Options”కి వెళ్లాలి. లేదంటే “Shift + F10” అనే షార్ట్‌కట్‌ను ఉపయోగించి పాత ఫీచర్లను డైరెక్ట్‌గా ఓపెన్‌ చేయవచ్చు.


 ఆండ్రాయిడ్‌ యాప్‌ సపోర్ట్‌

విండోస్‌ 11లో ఆండ్రాయిడ్ యాప్స్‌ సపోర్ట్‌ కోసం మైక్రోసాఫ్ట్ ప్రత్యేకమైన సాంకేతికతను తీసుకొచ్చింది. అమెజాన్‌ సంస్థ భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్‌ ఈ కొత్త తరహా ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అమెజాన్‌ యాప్‌ స్టోర్‌లో ఆండ్రాయిడ్‌ యాప్స్‌, గేమ్స్‌ పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. ఇవి కాకుండా విండోస్‌ 11లో ‘ఇన్‌స్టాల్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌’ నుంచీ యాప్స్‌, గేమ్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

 

 స్టార్ట్‌ మెనూతో ఫోల్డర్స్‌ తెరవచ్చు..

విండోస్‌ 11లో స్టార్ట్ మెనూతో డైరెక్ట్‌గా మనం క్రియేట్ చేసుకున్న ఫోల్డర్లను తెరవచ్చు. మైక్రోసాఫ్ట్‌ తాజాగా డెస్క్‌టాప్‌ ఓఎస్‌లో స్టార్ట్‌ సెట్టింగ్‌లో ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్టార్ట్‌ మెనూలోని ఫోల్డర్లతో మీడియా ఫైల్స్‌ను, డౌన్‌లోడ్స్‌, ఇతరత్రా డాక్యుమెంట్లను యాక్సెస్ చేయవచ్చు.

ఈ ఫీచర్‌ను కోసం..  Settings -> Personalization -> Start page -> Folders ను ఎనెబుల్‌ చేసుకుంటే సరిపోతుంది.


 రీడిజైన్‌ ఎమోజీ పికర్‌..

విండోస్‌ 11లో 3డీ ఎమోజీస్‌ అందుబాటులోకి రాలేదు కానీ, మైక్రోసాఫ్ట్ తాజాగా ఎమోజీ పికర్‌ను రీడిజైన్ చేసింది.  “Windows + ” అనే షార్ట్‌ కట్‌ కీని ఉపయోగించి వీటిని ఇక నేరుగా ఓపెన్‌ చేయవచ్చు. స్నేహితులతో వాట్సాప్‌ వెబ్‌లో గానీ, ఇతరత్రా మెసేజింగ్‌ సర్వీస్‌లల్లో చాటింగ్‌ చేస్తున్నపుడు సులువుగా పంపడానికి వీలుగా మైక్రోసాప్ట్‌ వీటిని రూపొందించింది.


 షేక్‌ చేస్తే మినిమైజ్..

మనం సిస్టమ్‌లో పని నిమిత్తం చాలా విండోలను ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. మనకు కావాల్సిన విండోను మరలా తెరవాలంటే మిగతా వాటిని మినిమైజ్‌ చేయాల్సి ఉంటుంది. దీనికి చాలా టైం వేస్ట్‌ అవుతోంది. అలా కాకుండా ఉండటం కోసం విండోస్‌ 11లో ఓ ప్రత్యేకమైన ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఇంపార్టెంట్‌ అనుకున్నా విండోపై ఫోకస్‌ చేయడానికి షేక్‌ టు మినిమైజ్‌ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని ఎనెబుల్‌ చేసుకోవడం కోసం.. Settings -> System -> Multitasking లోకి వెళ్లి టైటిల్‌ బార్‌ విండోస్‌ షేక్‌ అనే ఆప్షన్‌ను టర్న్‌ అన్‌ చేస్తే సరిపోతుంది. 


 ఒక్కో యాప్‌ ఒక్కోలా సౌండ్‌..

విండోస్‌ 11లో ఒక్కో యాప్‌లో ఒక్కో రకంగా సౌండ్‌ సెట్‌ చేసుకునేలా వాల్యూమ్ మిక్సర్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని ఎనెబుల్‌ చేయడానికి Settings -> System -> Sound -> Volume mixerపై క్లిక్‌ చేయాలి. ఇందులో మనకు కావాల్సిన యాప్‌లో ఎంత మేర సౌండ్‌ ఉండాలో సెటప్ చేసుకోవాలి.


 స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్టుగానే..

స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్టుగానే ల్యాప్‌టాప్‌ యూజర్లకు విండోస్‌ 11లోనూ డ్యాష్‌బోర్డులో స్క్రీన్‌ టైంను చూసుకునే ఫీచర్‌ను మైక్రోసాఫ్ట్‌ తీసుకొచ్చింది. స్క్రీన్‌ ఆన్‌/ ఆఫ్‌ టైం, స్లీప్ టైప్‌ లాంటి వాటిని చెక్ చేసుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఏ యాప్స్‌కు ఎక్కువగా బ్యాటరీ వృథా అవుతుందనే విషయం తెలుసుకోవడంతో పాటు సిస్టమ్‌ బ్యాటరీ లైఫ్‌ను కాపాడుకునేందుకు వీలుగా ఈ ఫీచర్‌ ఉపయోగపడుతోంది.


గమనిక: ఈ ఫీచర్లు ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. ప్రయోగాత్మకంగా కొంతమందికే ఈ సౌకర్యాలు అందిస్తున్నారు. త్వరలో అందరూ వాడొచ్చు.


ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని