Blackberry: ఐకానిక్‌ ‘బ్లాక్‌బెర్రీ 5జీ’ కథ ఇక ముగిసినట్టే..!

బ్లాక్‌బెర్రీ అభిమానులకు తీవ్ర నిరాశ. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్లాక్‌బెర్రీ 5జీ మొబైల్‌ ఇక రానట్టే..!

Published : 21 Feb 2022 23:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్లాక్‌బెర్రీ అభిమానులకు తీవ్ర నిరాశ. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్లాక్‌బెర్రీ 5జీ మొబైల్‌ ఇక రానట్టే..! కొద్దినెలల కిందట ఫిజికల్ కీబోర్డ్‌తో బ్లాక్‌బెర్రీ 5జీ మొబైల్‌ను 2022లో తీసుకురానున్నట్లు టెక్సాస్‌కు చెందిన అంకుర సంస్థ ఆన్‌వర్డ్‌ మొబిలిటీ (Onward Mobility) వెల్లడించింది. అయితే, ఈ ప్రయత్నాలు నిలిపివేస్తున్నట్లు ఆ కంపెనీ తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు ఆన్‌వర్డ్‌ మొబిలిటీ ప్రారంభించనప్పటి నుంచి తమకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ కంపెనీ ధన్యవాదాలు తెలిపింది. ఆన్‌వర్డ్‌ మొబిలిటీని షట్‌డౌన్‌ చేస్తున్నామని చెప్పడానికి చాలా విచారంగా ఉంది.. ఇకపై తాము ఫీజికల్‌ కీబోర్డ్‌తో పనిచేసే అల్ట్రా-సెక్యూర్‌ స్మార్ట్‌ మొబైల్స్‌ను అభివృద్ధి చేయబోమని పేర్కొంది. 

ఈ ఏడాదిలో 5జీ ఎనేబుల్డ్‌ బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ మొబైల్‌ను విడుదల చేయడానికి కృషి చేస్తున్నట్లు కొద్దినెలల కిందట ఈ కంపెనీ ప్రకటించింది. అయితే, ఇది చెప్పిన కొన్ని వారాలకు కంపెనీ ‘బ్లాక్‌బెర్రీ’ పేరును ఉపయోగించే హక్కులను కోల్పోయింది. ఈ క్రమంలోనే ఆన్‌వర్డ్‌ మొబిలిటీని షట్‌డౌన్‌ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించడం గమనార్హం. మరోవైపు బ్లాక్‌బెర్రీ 5జీ మొబైల్‌కు సంబంధించి ఎటువంటి చిత్రాలను కంపెనీ ఇప్పటివరకు పంచుకోలేదు. 2015 ఏడాది చివరలో విడుదలైన ఆండ్రాయిడ్‌ ఆధారిత స్లయిడర్‌ ఫోన్‌ డిజైన్‌తో దీనిని తీసుకొస్తున్నట్లు మాత్రమే వార్తలు వచ్చాయి. తాజాగా బ్లాక్‌బెర్రీ 5జీ కథ అర్ధంతరంగా ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని