Spacebar Shortcut: స్పేస్‌బార్‌తోనే పైకీ కిందికీ

వెబ్‌ పేజీ బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు, పీడీఎఫ్‌ డాక్యుమెంట్లు చదువుతున్నప్పుడు అప్‌, డౌన్‌ బాణం గుర్తులు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో తేలికగా పేజీని పైకీ, కిందికీ స్క్రోల్‌ చేయొచ్చు. మరి ఎప్పుడైనా

Updated : 29 Jul 2021 16:18 IST

వెబ్‌ పేజీ బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు, పీడీఎఫ్‌ డాక్యుమెంట్లు చదువుతున్నప్పుడు అప్‌, డౌన్‌ బాణం గుర్తులు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో తేలికగా పేజీని పైకీ, కిందికీ స్క్రోల్‌ చేయొచ్చు. మరి ఎప్పుడైనా అప్‌, డౌన్‌ బాణం గుర్తులు పనిచేయకపోతే? కర్సర్‌తో పని కానిచ్చేయొచ్చు. కానీ ప్రతిసారీ కర్సర్‌ను కదిలించటం ఇబ్బందిగా ఉండొచ్చు. మరేంటి దారి? దీనికి తేలికైన చిట్కా ఒకటుంది. అదే స్పేస్‌బార్‌. బ్రౌజర్‌లో పేజీని ఓపెన్‌ చేసినప్పుడు స్పేస్‌బార్‌ను నొక్కితే పేజీ కిందికి రావొచ్చు. అదే షిష్ట్‌, స్పేస్‌బార్‌ రెండిటినీ కలిపి నొక్కితే పైకి వెళ్లొచ్చు. ఇది విండోస్‌ 10, మ్యాక్‌ఓఎస్‌లోనూ పనిచేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని