పీడీఎఫ్ రీడర్స్‌ కోసం అడోబ్ లిక్విడ్‌ మోడ్‌

అడోబ్‌ అక్రోబాట్ రీడర్‌ ఐఓఎస్‌, ఆండ్రాయిడ్ యాప్‌  యూజర్స్‌ కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. లిక్విడ్‌ మోడ్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ అడోబ్ సెన్సయి ఏఐ ఫ్రేంవర్క్‌ ఆధారంగా పనిచేస్తుంది....

Updated : 20 Oct 2020 14:30 IST

ఇంటర్నెట్ ‌డెస్క్‌: అడోబ్‌ అక్రోబాట్ రీడర్‌ ఐఓఎస్‌, ఆండ్రాయిడ్ యాప్‌  యూజర్స్‌ కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. లిక్విడ్‌ మోడ్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ అడోబ్ సెన్సయి ఏఐ ఫ్రేంవర్క్‌ ఆధారంగా పనిచేస్తుంది. దీని ద్వారా పీడీఎఫ్ డాక్యుమెంట్స్‌ని యూజర్స్‌కి మరింత చేరువ చేయడంతో పాటు వాటిని మొబైల్‌ ఫ్రెండ్లీగా మారుస్తుంది. అంతేకాకుండా యూజర్స్‌ డిజిటల్‌ డాక్యుమెంట్స్‌ ఉపయోగించే విధానంలో మార్పులు తీసుకురావడం దీని ముఖ్యోద్దేశం. ప్రస్తుతం యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ని త్వరలోనే డెస్క్‌టాప్‌, బ్రౌజర్‌ వెర్షన్‌లో పరిచయం చేయనున్నట్లు అడోబ్‌ తెలిపింది. క్రోమ్ ‌బుక్స్‌లో కూడా ఇది పనిచేస్తుంది.

ఎలా పనిచేస్తుందంటే..?

ఉదాహరణకు మీరు మొబైల్‌లో పీడీఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్‌ చేశారనుకుందాం.  అందులో చాలా పేజీలు ఉన్నాయి. వాటన్నింటినీ స్క్రోల్ చేస్తూ చదవడం ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక్కడే లిక్విడ్ మోడ్‌ సమర్ధవంతంగా పనిచేస్తుంది. డాక్యుమెంట్‌ను సులభంగా చదివేలా మార్పులు చేస్తుంది. అడోబ్‌ సెన్సయి ఏఐ, మెషీన్‌ లెర్నింగ్ సహాయంతో డాక్యుమెంట్‌లోని హెడ్డింగ్స్‌, పేరా గ్రాఫ్స్‌, ఇమేజెస్‌, లిస్ట్స్, టేబుల్స్‌ని గుర్తించి వాటిని ఆ డివైజ్‌కి అనుగుణంగా సర్దుబాటు చేసి డాక్యుమెంట్‌ని సులభంగా చదివేందుకు అనువుగా మారుస్తుంది. మొబైల్‌లో పీడీఎఫ్ డాక్యెమెంట్‌లోని టెక్ట్స్‌ చదవడానికి ఇబ్బందిపడేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అడోబ్ తెలిపింది. అలానే లిక్విడ్ మోడ్‌లో ప్రాసెస్‌ అయిన డాక్యుమెంట్‌లో పదాల సైజుని అవసరమైనట్లుగా మార్చుకోవడంతో పాటు ఇమేజస్‌ని పెద్దవిగా చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఈ ఫీచర్‌ను పొందేందుకు అడోబ్ అక్రోబాట్ రీడర్‌ యాప్‌ని అప్‌డేట్ చేయాలి. యాప్‌లో ఫీచర్‌ అందుబాటులోకి వస్తే పైభాగంలో లిక్విడ్‌ మోడ్‌ బటన్‌ వెలుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని