ఈ వాచ్‌తో బ్లడ్‌ ఆక్సిజన్‌ స్థాయి తెలుస్తుంది!

స్మార్ట్‌వాచ్‌లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని బోట్‌ తన తొలి స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ‘స్టార్మ్‌’పేరిట దీన్ని.....

Updated : 12 Aug 2022 15:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ వాచ్‌లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని బోట్‌ తన తొలి స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ‘స్టార్మ్‌’ పేరిట తీసుకొచ్చిన ఈ వాచ్‌ ధర రూ.1,999. అక్టోబర్‌ 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌, బోట్‌ వెబ్‌సైట్లలో విక్రయాలు చేపట్టనున్నారు. నలుపు, నీలం రంగుల్లో ఈ వాచ్‌ లభించనుంది. హార్ట్‌ రేట్‌, బ్లడ్‌-ఆక్సిజన్‌ మానిటరింగ్ వంటి‌ ఫీచర్లు‌ ఈ వాచ్‌ ప్రత్యేకం.

వాచ్‌లో 1.3 అంగుళాల టచ్‌ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే అమర్చారు. వాచ్‌ డయల్‌ను నచ్చిన విధంగా తీర్చిదిద్దేందుకు 100 వరకు వాచ్‌ ఫేసెస్‌ అందిస్తున్నారు. ఒకసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 10 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ వస్తుంది. స్టాండ్‌బైలో 30 రోజుల పాటు ఉంటుందట. 24/7 హార్ట్‌ రేట్‌, రియల్‌ టైమ్‌ బ్లడ్ ఆక్సిజన్‌ స్థాయిని కొలిచేందుకు ఇందులోని ఇన్‌బిల్ట్‌ ఎస్‌పీఓ2 మానిటరింగ్‌ సిస్టమ్‌ ఉపయోగపడుతుంది. 

వాచ్‌లో మొత్తం తొమ్మిది స్పోర్ట్స్‌ మోడ్స్‌ అందిస్తున్నారు. రన్నింగ్‌, వాకింగ్‌, సైక్లింగ్‌, క్లైంబింగ్‌, ట్రెడ్‌మిల్‌, యోగా వంటి మోడ్స్‌ ద్వారా మీ యాక్టివిటీని ట్రాక్‌ చేయొచ్చు. ఒకేసారి ఎనిమిది రకాల మోడ్స్‌ను ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ వాచ్‌ ద్వారా మీ స్మార్ట్ ‌ఫోన్‌లోని మ్యూజిక్‌, వాల్యూమ్‌, ట్రాక్స్‌, కాల్స్‌ను నియంత్రించొచ్చు. ఇందులోని స్మార్ట్‌ నోటిఫికేషన్‌ ఫీచర్‌ ద్వారా నేరుగా స్మార్ట్‌వాచ్‌లోనే మొబైల్‌ నోటిఫికేషన్లు చదువుకోవచ్చు. వాచ్‌ను కంట్రోల్‌ చేసేందుకు మీ ఫోన్‌లో బోట్‌ ప్రో గేర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రారంభ ఆఫర్‌ కింద తక్కువ ధరకు ఈ వాచ్‌ను అందిస్తున్నామని కంపెనీ చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని