ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ స్కాన్‌తో జియోనీ ఫోన్

తక్కువ ధర ఎక్కువ ఫీచర్లతో ఫోన్లను అందించేందుకు జియోనీ కంపెనీ ఇతర మొబైల్ తయారీ సంస్థలతో పోటీ పడుతోంది. తాజాగా జియోనీ ఎం12 ప్రో పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది.....

Published : 09 Sep 2020 18:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో ఫోన్లను అందించేందుకు జియోనీ కంపెనీ ఇతర మొబైల్ తయారీ సంస్థలతో పోటీ పడుతోంది. తాజాగా జియోనీ ఎం12 ప్రో పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. క్వాడ్ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్‌ ప్రత్యేకతలు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.2 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్‌ హీలియో పీ60 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ ఉపయోగించారు.

జియోనీ ఎం12 ప్రోలో మొత్తం మూడు కెమెరాలు ఉన్నాయి. వెనక రెండు ముందు ఒకటి ఇస్తున్నారు. వెనకవైపు 16 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరాతో పాటు 5ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్‌ కెమెరా ఉన్నాయి. అయితే ఫోన్ వెనక నాలుగు కెమెరాలు ఉన్నట్లు కనిపించినప్పటికీ నాలుగో కెమెరా స్థానంలో కేవలం సాధారణ లెన్స్‌ మాత్రమే అమర్చారు. ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 6జీబీ ర్యామ్‌/128జీబీ వేరియంట్ ధర 700 యువాన్లు. అంటే మన కరెన్సీలో సుమారుగా రూ.7,500. వైట్, బ్లూ గ్రేడియంట్ గ్లాసీ ఫినిష్ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్‌ను భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారు? ధర వంటి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని