
గూగుల్ మ్యాప్స్‌లో ఫీచర్.. పిన్ చేస్తే చాలు
ఇంటర్నెట్ డెస్క్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తూ యూజర్స్‌కి మెరుగైన సేవలందిస్తోంది సెర్చ్ ఇంజిన్ గూగుల్. తాజాగా ఆండ్రాయిడ్ ఐఓఎస్ యూజర్స్ కోసం గూగుల్ మ్యాప్స్‌లో గో ట్యాబ్ ఫీచర్‌ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీని వల్ల మనం తరచుగా వెళ్లే ప్రదేశాలను మ్యాప్స్‌లో పిన్ చేసుకోవచ్చు. అంటే సూపర్ మార్కెట్లు, పాఠశాలలు, షాపింగ్ మాల్స్ వంటి వాటికి వెళ్లే దారిని గుర్తుపెట్టుకోకుండా మ్యాప్‌లో పిన్ చేసుకుంటే సరిపోతుంది. అలానే వెళ్లే దారిలో ఎంత ట్రాఫిక్ ఉంది, గమ్యాన్ని చేరుకోవాలంటే ఎంత సమయం పడుతుంది వంటి విషయాలను తెలుసుకోవచ్చు.
గో ట్యాబ్ సహాయంతో యూజర్ తరచుగా వెళ్లే ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాలను పిన్ చేసుకోవచ్చు గూగుల్ తెలిపింది. ఇందుకోసం యూజర్ ప్రతిసారి పూర్తి అడ్రస్ టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. అలానే ప్రతి దారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా కారు డ్రైవింగ్ రూట్, ప్రజా రవాణాకు సంబంధించిన రూట్లను కూడా గో ట్యాప్ ద్వారా పిన్ చెయ్యొచ్చు. దీని వల్ల యూజర్ గమ్యానికి ఏ దార్లో వెళితే తొందరగా చేరుకోవచ్చనేది కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న ఎక్స్ప్లోర్, సేవ్డ్ ట్యాబ్స్ ఫీచర్ స్థానంలో ఇక మీదట గో ట్యాబ్ అందుబాటులోకి రానుంది. మరి కొన్ని వారాల్లో ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌కి అందుబాటులోకి రానుందట.
కొద్ది రోజుల క్రితం గూగుల్ మ్యాప్స్ కమ్యూనిటీ ఫీడ్ పేరుతో స్థానిక ప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించే ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా స్థానికంగా ఉన్న ప్రదేశాలకు సంబంధించి యూజర్స్ అందించే సమాచారాన్ని విశ్లేషించి వాటికి రేటింగ్ ఇస్తారు. దాని వల్ల మీరు అక్కడి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న సందర్శన స్థలాలు, ఇతర ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను గూగుల్ మ్యాప్స్ మీకు సిఫార్సు చేస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.