Updated : 03 Sep 2020 13:36 IST

గూగుల్ కిడ్స్‌స్పేస్: ఈ యాప్‌ పిల్లలకు ప్రత్యేకం

ఇంటర్నెట్‌డెస్క్‌: చిన్నపిల్లల కోసం గూగుల్ ప్లేస్టోర్‌లో ఎన్నో రకాల యాప్‌లు స్మార్ట్‌ఫోన్‌ యూజర్స్‌కి అందుబాటులో ఉన్నాయి. వాటిలో కార్టూన్‌ వీడియోలు, గేమ్స్‌, బుక్స్‌, యాక్టివిటీ, చదువుకు సంబంధించినవి బోలెడు. అయితే ఈ కేటగిరీలో స్మార్ట్‌ఫోన్‌ యూజర్స్‌తో పోలిస్తే ట్యాబ్ యూజర్స్‌కి ఉన్నవి చాలా తక్కువే. అందుకే స్మార్ట్‌ఫోన్ యూజర్స్‌కి ఏమాత్రం తీసిపోకుండా ట్యాబ్ యూజర్స్‌ కోసం ‘గూగుల్ కిడ్స్‌ స్పేస్‌’ పేరుతో సరికొత్త యాప్‌ను రూపొందించింది గూగుల్.

ఈ యాప్‌లో యూట్యూబ్ కిడ్స్‌, ఫ్యామిలీ లింక్‌ వంటివి కూడా ఉంటాయి. వాటితో పాటు పిల్లలు నేర్చుకునేందుకు వీలుగా ఉండే టీచర్ అప్రూవ్‌డ్ కంటెంట్‌ను కొత్తగా యాడ్ చేశారు. ఇది పిల్లలు కొత్త విషయాలు నేర్చుకునేందుకు మరింత దోహదపడుతుంది. వయసు, ఆసక్తి ఆధారంగా పిల్లలు తమకు నచ్చిన అంశాలను ఎంచకునేందుకు వీలుగా ఇందులో  వివిధ రకాల వీడియోలు, యాక్టివిటీకి సంబంధించిన కార్యక్రమాలు, పుస్తకాలు, గేమ్స్‌ వంటివి ఎన్నో ఉన్నాయి. 

ఈ యాప్‌లో రిజిష్టర్ అయిన తర్వాత పిల్లలకి ప్రత్యేకమైన యానిమేటేడ్ సింబల్‌ను కేటాయిస్తారు. తర్వాత యానిమల్స్‌, డ్రాయింగ్, పెయింటింగ్, స్టోరీ రైటింగ్, మ్యూజిక్‌ వంటివి ఆప్షన్స్‌ లిస్ట్ అవుతాయి. వాటిలో పిల్లలు తమకు నచ్చిన దానిని ఎంపికచేసుకుని కస్టమైజ్‌ చేసుకోవచ్చు. దాని ఆధారంగా ప్రతి రోజూ కొత్త వీడియోలు, చదువుకు సంబంధించిన కంటెంట్‌, గేమ్స్‌ వంటి వాటిని యాప్‌ వారికి సూచిస్తుంది. ఒక వేళ లిస్ట్‌లో తమకు ఆసక్తి ఉన్న అంశం కనిపించకపోతే, పైన కుడివైపున సెర్చ్‌ ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్లి మనకు కావాల్సిన దాని పేరు టైప్ చేసి వెతికే సదుపాయం కూడా ఉంది.

ప్రస్తుతం ఈ యాప్‌ను సెకండ్ జనరేషన్‌ లెనోవా ఎం19 హెచ్‌డీ స్మార్ట్‌ట్యాబ్‌లో గూగుల్ అసిస్టెంట్ సాయంతో అందిచనున్నారు. అలానే  లెనోవా ఎం10 హెచ్‌డీ ట్యాబ్‌లో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. త్వరలోనే అన్ని రకాల ట్యాబ్‌లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ తెలిపింది.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts