యాప్ తోడుగా... మారిపోండి ఫిట్‌గా
జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా ఎక్కువ మంది చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో తినే తిండి నుంచి చేసే పని వరకు ప్రతిదీ లెక్కలు వేసుకుని మరీ చేస్తున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో ఈ జాగ్రత్తలు మరింత పెరిగాయి....
ఇంటర్నెట్ డెస్క్: ఫిట్‌గా ఉండటం అంటే ఎవరికి నచ్చదు. ఈ విషయంలో అశ్రద్ధ చేసేవారు కూడా కొవిడ్-19 నేపథ్యంలో ఫిట్‌గా ఉండేందుకు కసరత్తు బాటపట్టారు. ఇంట్లోనే కసరత్తులు చేసేందుకు ఉపయోగపడే ఫిట్నెస్ యాప్‌లపై దృష్టి సారిస్తున్నారు. ఫిట్నెస్ యాప్‌లు ఎప్పటికప్పుడు యూజర్ ఫిట్నెస్ను మానిటర్ చేస్తూ అవసరమైన సూచనలు చేస్తుంటాయి. అంతేకాకుండా మీరు ఎంత బరువు ఉండాలి, ఎన్ని కేలరీలు ఖర్చు చేయాలి అంటూ పర్సనల్ ట్రైనర్లా చెబుతాయి. అలాంటి కొన్ని యాప్‌ల వివరాలు మీ కోసం..
గూగుల్ ఫిట్ (Google Fit)
వర్కవుట్స్‌ని మానిటర్ చేస్తూ టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఇంకా ఎంత దూరంలో ఉన్నామనేది గూగుల్ ఫిట్‌లో చూపిస్తుంది. మనిషి బరువు, ఎత్తుతో పాటు, ఎప్పుడు నడవాలనుకుంటున్నారు వంటి వివరాలు యాప్‌లో ఎంటర్ చేస్తే మీ అడుగుల్ని ట్రాక్ చేసి వివరాలను అందిస్తుంది. అలానే మీరు చేసే యాక్టివిటీ ఆధారంగా హార్ట్ పాయింట్స్‌ను ఇస్తుంది. మీరు పొందిన పాయింట్ల ఆధారంగా యాక్టివిటీ గోల్స్‌ను సెట్ చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌తో కలసి రూపొందించిన ఆరోగ్యపరమైన విశేషాలను అందిస్తుంది.
ఎంఐ ఫిట్ (Mi Fit)
షావోమి ఫిట్నెస్ బ్యాండ్లకు అనుసంధానంగా షావోమి ఫిట్ యాప్ పని చేస్తుంది. ఇందులో యాక్టివిటీ మానిటర్, స్లీప్ ఎనాలసిస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వాటితో వర్కవుట్స్‌ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగిన సూచనలు చేస్తుంది. యాప్‌లోని వీడియో ట్యుటోరియల్స్ మీరు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.
శాంసంగ్ హెల్త్ (Sasmsung Health)
బిల్ట్ ఇన్ ట్రాకర్స్‌తో రోజువారీ ఫిట్నెస్ యాక్టివిటీని రికార్డ్ చేసి ఆరోగ్యంగా ఉండేందుకు శాంసంగ్ హెల్త్ యాప్ సూచనలు చేస్తుంది. ఫిట్‌గా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి వంటి వాటిని సూచిస్తుంది. అలానే హెల్త్ ప్రొఫెషనల్స్ నుంచి ఫిట్‌గా ఉండేందుకు సలహాలు యాప్‌లో పొందొచ్చు.
హెల్తీఫై మి (HealthifyMe)
రోజూ తీసుకునే ఆహార వివరాలు ఎంటర్ చేస్తే వాటితో ఎన్ని క్యాలరీలు వచ్చాయనేది హెల్తీఫై మీ యాప్ చెప్పేస్తుంది. వ్యాయామం, ఆడే ఆటలు వల్ల ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయనేదీ తెలుసుకోవచ్చు. ఆహార వివరాల ఆధారంగా మీ ఫిట్నెస్ గోల్స్‌ను సూచిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ప్రత్యేకమైన డైట్, వర్కవుట్ ప్లాన్స్‌తో యాప్ ఫిట్నెస్ కోచ్‌లా పని చేస్తుంది. ఇందులో 50 రకాల వర్కవుట్ మోడ్స్ ఉంటాయి.
మైఫిట్నెస్పాల్ (MyFitnesspal)
బరువు తగ్గాలన్నా, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలన్నా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మైఫిట్నెస్పాల్ యాప్‌లో అనేక ఫుడ్ వెరైటీల వివరాలు ఉంటాయి. ఇవన్నీ పోషకాహార నిపుణులు సూచించనవే. వాటిని ఎలా తయారు చేసుకోవాలి, ఏవేవి ఎప్పుడు తినాలి వంటి వివరాలు యాప్‌లో ఉంటాయి. అంతేకాకుండా బరువు తగ్గడానికి, పెరగడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇందులో వివరంగా ఉంటుంది. వివిధ రకాల వర్కవుట్ వీడియోలనూ చూడొచ్చు. నిపుణుల సలహాలు తీసుకోవచ్చు, యాక్టివిటీ వివరాలను స్నేహితులకు షేర్ చేయొచ్చు.
హోం వర్కవుట్ (Home Workout)
ఎలాంటి పరికరాల అవసరం లేకుండా వర్కవుట్స్‌తో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలనుకునే వారికి హోం వర్కవుట్ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. వారంలో మీరు ఎలాంటి వర్కవుట్స్ చేయాలనేది ముందుగా సూచిస్తుంది. ఒకవేళ ఆ వారంలో మీరు గోల్స్‌ను అందుకోలేకపోతే దానికి అనుగుణంగా తర్వాతి వారం వర్కవుట్ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. యాప్‌లో యానిమేషన్స్, వీడియోల ద్వారా వర్కవుట్స్ ఎలా చేయాలో సూచిస్తుంది.
నైక్ ట్రైనింగ్ క్లబ్ (Nike Training Club)
ఫిట్నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో ఇంట్లోనే వర్కవుట్స్ చేయాలనుకునే వారు నైక్ ట్రైనింగ్ క్లబ్ యాప్ ఉపయోగించవచ్చు. ఇందులో ప్రొఫెషనల్ ట్రైనర్స్, అథ్లెట్స్ రూపొందించిన వీడియోలు ఉంటాయి. కార్డియో, స్ట్రెంగ్త్, హిట్, యోగా తదితర కేటగిరీల వర్కవుట్స్ జాబితా ఉంటుంది. ఫిట్‌నెస్‌లో భాగంగా ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో యాప్ సూచిస్తుంది.
డైలీ వర్కవుట్స్ (Daily Workouts)
వర్కవుట్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించలేని వారు ఈ యాప్‌తో తమ పిట్నెస్ గోల్స్ సులభంగా పూర్తి చేయొచ్చు. ఐదు నుంచి పది నిమిషాల్లో పూర్తి చేసేలా పది రకాల వర్కవుట్స్‌ను యాప్ సూచిస్తుంది. 10 నుంచి 30 నిమిషాల్లో ఫుల్ బాడీ వర్కవుట్స్ ఉంటాయి. పురుషులు, మహిళలకు ఫిట్‌నెస్‌కు సంబంధించి వందకు పైగా ఎక్సర్సైజ్ల జాబితా ఇందులో ఉంది. అలానే యానిమేటేడ్ వీడియోల ద్వారా వర్కవుట్స్ ఎలా చేయాలో చూపిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది. -
గాజు బిందువు ఇంద్రజాలం
ఎప్పుడైనా గాజు కన్నీటి చుక్కల గురించి విన్నారా? అవి స్టీలు కన్నా దృఢంగా ఉంటే? బుల్లెట్ దెబ్బనైనా తట్టుకుంటే? సైన్స్ సూత్రాలనూ ధిక్కరిస్తే? అంత విచిత్రమైన గాజు బిందువు లేంటని అనుకుంటున్నారా? అవే ప్రిన్స్ రూపర్ట్స్ డ్రాప్స్. -
వృక్షో రక్షతి రక్షితః
జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఛార్లెస్ డార్విన్ అప్పుడెప్పుడో కన్న కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రపంచంలో మనకు తెలిసిన అన్ని మొక్కల జాబితాను రూపొందించాలనే ఆయన ఆశయాన్ని రాయల్ బొటానిక్ గార్డెన్స్ ఇటీవల సాకారం చేసింది. -
వాతావరణతరంగ శోధన
భూమి, అంతరిక్ష వాతావరణం మధ్య జరిగే చర్యల మీద అధ్యయనం చేయటం దీని ఉద్దేశం. -
ఏఐయ్యారే!
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఛాట్‌జీపీటి సమస్త సమాచార సారాంశాన్ని చిటికెలో ముందుంచుతోంది. -
వర్షం కృత్రిమం
ఉక్కపోస్తే ఫ్యాన్ వేసుకుంటాం. చుట్టుపక్కల గాలిని మనవైపు తిప్పుకొంటాం. ఇంట్లో ఉష్ణోగ్రత పెరిగితే ఏసీ వేసుకుంటాం. వేడి గాలిని చల్లబరచి హాయిని అనుభవిస్తాం -
Phone Hacking: ఫోన్ హ్యాక్ అయ్యిందా?
ప్రభుత్వ ప్రాయోజిత అటాకర్లు ఐఫోన్ల మీద దాడి చేసే అవకాశముందని ఇటీవల యాపిల్ సంస్థ ప్రముఖ ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులను హెచ్చరించటం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక్క మనదేశానికి చెందినవారికే కాదు.. 150 దేశాల్లోకి వ్యక్తులకూ ఈ నోటిఫికేషన్లు అందాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం యాపిల్‌కు నోటీసులు జారీ చేసి, వివరణ కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు