Published : 23 Jul 2021 23:31 IST

Smart Gadgets: వాచ్‌ నుంచి గ్లాసెస్ దాకా.. అంతా స్మార్టే!

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్లతోపాటు వాటికి అనువైన స్మార్ట్‌ యాక్ససరీస్‌కు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌, టీడబ్ల్యూఎస్‌, స్మార్ట్‌వాచ్‌లు వంటివి ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఈ జాబితాలో స్మార్ట్‌గ్లాసెస్‌ కూడా వచ్చి చేరాయి. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెక్ కంపెనీలు సైతం సరికొత్త ఫీచర్స్‌తో స్మార్ట్‌ వేరబుల్స్‌ను విడుదల చేస్తున్నాయి. తాజా సర్వే ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది స్మార్ట్‌ వేరబుల్స్ వినియోగం పది శాతం పెరిగినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో శాంసంగ్‌, ఫాసిల్, బీట్స్‌ వంటి కంపెనీలు తీసుకొచ్చిన స్మార్ట్‌ వేరబుల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 


ఫాసిల్‌ జెన్ 5 ఎల్‌టీఈ స్మార్ట్‌వాచ్‌

ఈ ఏడాది మొదట్లో ఫాసిల్ కంపెనీ తన తొలి స్మార్ట్‌ వేరబుల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. జెన్ 5 ఎల్‌టీఈ పేరుతో ఈ వాచ్‌ను తీసుకొచ్చింది. ఇందులో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ వేర్‌ 3100 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గూగుల్ వేర్ ఓఎస్‌తో ఈ వాచ్ పనిచేస్తుంది. మొబైల్‌ ఫోన్ తరహాలో వాచ్‌ సాయంతో కాల్స్‌ చేసుకోవడంతోపాటు టెక్ట్స్, వాయిస్‌ మెసేజ్‌లను పంపొచ్చు. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది. హార్ట్‌రేట్, యాక్టివిటీ ట్రాకింగ్, గూగుల్‌ అసిస్టెంట్ ఫీచర్లు ఉన్నాయి. 1.28 అంగుళాల టచ్‌ స్క్రీన్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ధీని ధర రూ. 22,000. అమెజాన్‌ లేదా ఫాసిల్ ఇండియా వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చెయ్యొచ్చు. 


టిక్‌ వాచ్‌ ఈ3  

క్లాసిక్, స్టైలిష్ డిజైన్‌తో టిక్‌ వాచ్‌ కంపెనీ ఈ3 స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఇందులో బిల్ట్‌-ఇన్‌ జీపీఎస్‌తోపాటు ఐపీ68 వాటర్‌ రెసిస్టెన్స్ ఫీచర్ ఉంది. సుమారు 20కి పైగా వర్కవుట్ మోడ్స్ ఉన్నాయి. గూగుల్ వేర్ ఓఎస్‌తో ఈ వాచ్ పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ వేర్ 4100 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 1.3 అంగుళాల హై డెన్సిటీ డిస్‌ప్లే ఇస్తున్నారు. హార్ట్‌రేట్ సెన్సర్‌, బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ మానిటర్‌, నావిగేషన్, స్లీప్ మానిటరింగ్, గూగుల్ పే వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ వాచ్ ధర రూ.20,999. 


జబ్రా ఇలైట్ 85టీ టీడబ్ల్యూఎస్‌

యూజర్‌కి మెరుగైన ఆడియోని అందించేందుకు విండ్ ప్రొటెక్షన్ ఫీచర్‌తో ఆరు మైక్రోఫోన్‌లను ఇస్తున్నారు. దీని సాయంతో యూజర్ ఎలాంటి ఆటంకం లేకుండా ఆడియోను ఆస్వాదించవచ్చు. యాక్టివ్ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్ కూడా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 19 గంటలపాటు (ఛార్జింగ్ కేస్‌తో కలిపి) నిరంతరాయంగా పనిచేస్తాయి. టైటానియం బ్లాక్‌, గ్రే, గోల్డ్‌, కాపర్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తాయి. వీటి ధర రూ. 15,000.  


శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో

వృత్తిపరమైన అవసరాల కోసం ఇయర్‌బడ్స్ ఉపయోగించేవారికి శాంసంగ్ కొత్తగా గెలాక్సీ బడ్స్‌ ప్రో పేరుతో టీడబ్ల్యూఎస్‌ను విడుదల చేసింది. ఇవి చక్కటి ఆడియో అనుభూతిని అందిస్తాయని తెలిపింది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ ఫీచర్ కూడా ఉంది. ఇందులో మూడు మైక్రోఫోన్లతో పాటు వాయిస్ పిక్‌అప్‌ యూనిట్‌ను ఇస్తున్నారు. ఇయర్‌బడ్స్‌లో ఉండే మైక్‌ హై సిగ్నల్‌ టు నాయిస్‌ రేషియోతో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గిస్తుంది. ఇందుకోసం వీటిలో శాంసంగ్ విండ్ షీల్డ్ టెక్నాలజీని ఇస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 18 గంటలపాటు పనిచేస్తాయి. వాటర్‌ రెసిస్టెన్స్ ఫీచర్ ఉంది. బ్లాక్‌, వయోలెట్, సిల్వర్‌ రంగుల్లో లభిస్తుంది. భారత మార్కెట్‌లో వీటి ధర రూ. 15,990. 


బీట్స్ స్టూడియో బడ్స్‌ 

యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్ ఫీచర్‌ యాపిల్‌కు చెందిన బీట్స్‌ సంస్థ స్టూడియో బడ్స్ పేరుతో టీడబ్ల్యూఎస్‌ను తీసుకొచ్చింది. వీటిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 8 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. యూజర్‌కి చక్కడి ఆడియో అనుభూతిని అందించేందుకు వీటిలో డ్యూయల్ ఎలిమెంట్ డయాఫ్రమ్‌ డ్రైవర్స్‌ని ఉపయోగించారు. ఇవి యాపిల్, ఆండ్రాయిడ్‌ డివైజ్‌లను సపోర్ట్ చేస్తాయి. వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉంది. త్వరలోనే వీటిని భారత్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. వీటి ధర రూ. 11,000 వరకు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. 


ఫౌనా ఆడియో స్మార్ట్‌గ్లాసెస్‌

ఈ గ్లాసెస్‌లో మనకు నచ్చిన లెన్స్ పెట్టుకుని ఉపయోగించుకోవచ్చు. ఇందులోని మైక్రోఫోన్స్, స్పీకర్స్.. యూజర్‌కి చక్కటి ఆడియో అనుభూతిని అందిస్తాయి. ఫ్రేమ్‌కి ఎడమవైపున టచ్‌ కంట్రోల్స్ ఉన్నాయి. వీటి సాయంతో కాల్స్‌, ఆడియోని కంట్రోల్ చెయ్యొచ్చు. ఈ స్మార్ట్ గ్లాసెస్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 గంటల స్టాండ్‌బైతో 4 గంటలపాటు మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు. యాపిల్, ఆండ్రాయిడ్ డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది. భారత మార్కెట్‌లో వీటి ధర రూ.29,999.  


లెనోవో థింక్ రియాల్టీ ఏ3 స్మార్ట్‌గ్లాసెస్‌

అగ్‌మెంటెడ్ రియాల్టీ ఫీచర్‌తో థింక్‌ రియాల్టీ ఏ3 పేరుతో లెనోవో స్మార్ట్ గ్లాసెస్‌ను తీసుకొస్తోంది. దీన్ని ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసుకుని ఒకేసారి మూడు వర్చువల్ స్క్రీన్లను చూడొచ్చు. ఇందులో స్పీకర్, మైక్రోఫోన్ ఉన్నాయి. లెనోవో థింక్‌పాడ్ ల్యాప్‌టాప్‌కి అనుసంధానంగా వీటిని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇందులో పీసీ ఎడిషన్, ఇండస్ట్రియల్‌ ఎడిషన్ అని రెండు రకాలు ఉన్నాయి. మోటోరోలా స్మార్ట్‌ఫోన్లకు కూడా వీటిని కనెక్ట్ చేసుకోవచ్చని లెనోవా తెలిపింది. త్వరలోనే వీటిని భారత మార్కెట్లోకి తీసుకొస్తారని సమాచారం.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని