Moss Bandage: పుండ్లకు నాచు పట్టీ

ఎంతకీ మానని మొండి పుండ్లతో బాధపడటం కన్నా నరకం మరోటి ఉండదు. మధుమేహులకు.. సిరలు, ధమనుల జబ్బులు గలవారికి వీటి ముప్పు ఎక్కువ. వీరిలో చాలామంది మొండి పుండ్లతో బాధపడుతుంటారు. ఇలాంటివారి కోసం...

Updated : 02 Sep 2021 19:40 IST

కౌగిలింతతో గుర్తుపట్టేస్తారు! - Sunday Magazine

ఎంతకీ మానని మొండి పుండ్లతో బాధపడటం కన్నా నరకం మరోటి ఉండదు. మధుమేహులకు.. సిరలు, ధమనుల జబ్బులు గలవారికి వీటి ముప్పు ఎక్కువ. వీరిలో చాలామంది మొండి పుండ్లతో బాధపడుతుంటారు. ఇలాంటివారి కోసం ఐఐటీ కాన్పూర్‌కు చెందిన డాక్టర్‌ వివేక్‌ వర్మ కొత్త, చవకైన బ్యాండేజీని రూపొందించారు. ఏగర్‌ నాచు నుంచి తీసిన ఏగరోజ్‌ పాలీమర్‌కు సెరిసిన్‌, అయోడిన్‌, సిట్రిక్‌ యాసిడ్‌ వంటి వాటిని జోడించి దీన్ని తయారుచేయటం విశేషం. ఇవి పుండు త్వరగా మానటానికి వీలు కల్పిస్తాయి. ఈ బ్యాండేజీతో ఒకటి, రెండు పొరలుగానే కాదు పుండు రకం, తీవ్రతను బట్టి చాలా పొరలుగా కట్టు కట్టొచ్చు. ఇది రోగనిరోధకశక్తిని ప్రేరేపించదు సరి కదా. కట్టును తొలగించాక వాతావరణంలో తనకుతానుగా క్షీణిస్తుంది. ఎలుకల మీద పరీక్షించగా ఇది మంచి ఫలితం చూపించింది. దీంతో కుందేళ్లు, పందుల వంటి పెద్ద జంతువుల మీద, పెద్ద పుండ్ల మీద పరీక్షించాలని చూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని