MI 3i: ఛార్జి పెట్టుకుంటూ.. ఛార్జి పెడుతూ

మొబైల్ తయారీ కంపెనీ షావోమి కొత్తగా 3ఐ పేరుతో రెండు పవర్‌ బ్యాంక్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 10,000 ఎంఏహెచ్‌, 20,000 ఎంఏహెచ్ సామర్ధ్యంతో వీటిని తీసుకొచ్చారు....

Updated : 22 Sep 2020 21:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: షావోమి కొత్తగా 3ఐ పేరుతో రెండు పవర్‌ బ్యాంక్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 10,000 ఎంఏహెచ్‌, 20,000 ఎంఏహెచ్ సామర్థ్యంతో వీటిని తీసుకొచ్చారు. వీటిలో యుఎస్‌బీ టైప్‌-సీ, మైక్రో-యుఎస్‌బీ పోర్ట్స్‌ ఉంటాయి. 18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. స్మార్ట్ పవర్‌ మేనేజ్‌మెంట్ ఫీచర్‌తో 12-సర్య్కూట్ ప్రొటెక్షన్‌తో వీటిని తయారు చేశారు. వీటిలో 2-వే ఫాస్ట్‌ ఛార్జింగ్ ఫీచర్‌ కూడా ఉంది. అంటే యూజర్‌ ఒకే సారి పవర్‌బ్యాంక్‌ను ఛార్జింగ్‌ పెట్టుకుంటూనే... దాని నుంచి వేరే డివైజ్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్చు. 

10,000 ఎంఏహెచ్‌ పవర్‌ బ్యాంక్ పూర్తిగా ఛార్జ్‌ అయ్యేందుకు నాలుగు గంటల సమయం పడుతుంది. అదే 20,000 ఎంఏహెచ్ అయితే  ఏడు గంటలు పడుతుంది. వీటిలో లిథియం పాలిమర్ బ్యాటరీలను ఉపయోగించారు. ఇందులో లోపవర్‌ మోడ్ ఫీచర్ కూడా ఉంది. పవర్‌ బటన్‌ను రెండు సార్లు నొక్కిన తర్వాత లోపవర్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. అప్పుడు బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్, ఫిట్‌నెస్‌ బ్యాండ్ వంటివి ఛార్జ్‌ చేసుకోవచ్చు. 10,000 ఎంఏహెచ్ వేరియంట్ ధర ₹899. 20,000 ఎంఏహెచ్ వేరియంట్ ధర ₹1,499. అమెజాన్‌, ఎంఐ.కామ్‌ వెబ్‌సైట్‌లలో కొనుగోలు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని