Microsoft Teams: టీమ్స్‌ కొత్త ఫీచర్‌

టీమ్స్‌ను ఎప్పటికప్పుడు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దటానికి మైక్రోసాఫ్ట్‌ పలు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే వీడియో కాల్స్‌, ఫైల్‌ షేరింగ్‌ ఆప్షన్లను జోడించింది. అదే యాప్‌లో వ్యక్తిగత

Updated : 11 Aug 2021 16:32 IST

టీమ్స్‌ను ఎప్పటికప్పుడు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దటానికి మైక్రోసాఫ్ట్‌ పలు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే వీడియో కాల్స్‌, ఫైల్‌ షేరింగ్‌ ఆప్షన్లను జోడించింది. అదే యాప్‌లో వ్యక్తిగత, ఉద్యోగ ఖాతాలనూ కలిపేసే సదుపాయాన్ని కల్పించింది. తాజాగా టాప్‌ హిట్స్‌ ఫీచర్‌నూ జోడించనుంది. ప్రస్తుతం తయారీ దశలోనే ఉన్నప్పటికీ ఆగస్టు చివరికి దీన్ని అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. సెర్చ్‌ తీరును మెరుగు పరచటం దీని ఉద్దేశం. టీమ్స్‌ యాప్‌లో స్టోర్‌ చేసిన లేదా షేర్‌ చేసుకున్న ఛాట్స్‌, ఫైళ్లు, వ్యక్తులు, ఇతర సమాచారం నుంచి అవసరమైన సమాచారాన్నే వెతికి పెట్టటం దీని ప్రత్యేకత. ఇప్పటికే టీమ్స్‌లో నిక్షిప్తమైన సెర్చ్‌ ఆల్గోరిథమ్‌కు ఇది అదనం. దీంతో కలిసి మరింత వేగంగా, కచ్చితంగా సెర్చ్‌ చేసి పెడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని