Published : 17/11/2020 12:49 IST

మీ పాస్‌వర్డ్‌ సురక్షితమేనా.. మరేం చేయాలి?

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంటి భద్రతకు తాళం ఎంత ముఖ్యమో.. ఆన్‌లైన్‌ ఖాతాలు అంటే మెయిల్‌, క్లౌడ్‌ స్టోరేజ్‌, బ్యాంకింగ్‌తో పాటు ఇతరత్రా వాటికి పాస్‌వర్డ్ అంతే ముఖ్యం. అయితే ఇంటికి దొంగల భయం లేకుండా రక్షణగా సీసీ కెమెరాలు, అలర్ట్ అలారమ్‌ సిస్టం వంటి టెక్నాలజీ ఆధారిత సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆన్‌లైన్‌ ఖాతాలకు మనం సెట్ చేసే పాస్‌వర్డ్‌లు సురక్షితమేనా...? అవి మన ఖాతాలను ఎంత మేర భద్రంగా ఉంచుతాయి? దీనిపై నిపుణులు ఏమంటున్నారో చూడండి..

పాస్‌వర్డ్ భద్రతపై మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ విభాగం డైరెక్టర్‌ అలెక్స్‌ వీనర్ట్‌ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎలాంటి పాస్‌వర్డ్‌ అయినా, ఎంత బలంగా ఉన్నా.. అవి సమర్థమైనవి కావని పేర్కొన్నారు. తమ విభాగంలోని ఉద్యోగులు రోజుకు లక్షల సంఖ్యలో పాస్‌వర్డ్‌ ఆధారంగా జరిగే సైబర్‌ దాడులను నిలువరించేందుకు పనిచేస్తుంటారని తెలిపారు. పాస్‌వర్డ్ లక్ష్యంగా దాడి చేసే సైబర్‌ నేరస్థులకు సమయంతో పనిలేదని.. పాస్‌వర్డ్‌ బ్రేక్ చేసేవరకు పనిచేస్తుంటారని చెప్పారు. అలానే ఎన్నో రకాల పాస్‌వర్డ్ బ్రేకింగ్ టూల్స్‌ అందుబాటులో ఉండటం వారికి కలిసొచ్చే అంశంమని అలెక్స్ అన్నారు. దాని వల్ల సైబర్‌ నేరస్థులు తమ పని సులభంగా కానించేస్తారని తెలిపారు. అలానే సైబర్ నేరస్థులు పాస్‌వర్డ్‌ హ్యాకింగ్‌లో పైచేయి సాధించడానికి గల కారణాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

* పాస్‌వర్డ్ బ్రీచ్‌: ఇందులో సైబర్‌ నేరస్థులు పెద్ద సంఖ్యలో ఏదైనా కంపెనీ డేటాబేస్‌పై దాడి చేసి యూజర్స్‌ పాస్‌వర్డ్స్‌ను సేకరిస్తారు. అలా సేకరించిన డేటాతో మీ ఖాతాలోకి లాగిన్‌ అయి పాస్‌వర్డ్ మార్చడం లేదా సదరు కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో నగదు డిమాండ్‌ చేస్తారు. ఇలాంటివి జరగకుండా మైక్రోసాఫ్ట్ రోజుకు సుమారు 20 మిలియన్ ఖాతాలను పరిశీలిస్తుందట.

* పాస్‌వర్డ్ స్ప్రే: హ్యాకర్స్‌ మీ పాస్‌వర్డ్‌ని ఊహించి బ్రేక్‌ చేయడం. చాలా మంది పాస్‌వర్డ్ సులభంగా గుర్తుండడం కోసం పుట్టిన తేదీ, పెళ్లి రోజు లేదా తమ జీవితంలో ఇతరత్రా ముఖ్యమైన తేదీలను పాస్‌వర్డ్‌లుగా పెడుతుంటారు. అలా చేయడం వల్ల హ్యాకర్స్‌ నంబర్లతో పాస్‌వర్డ్‌ని ఊహించి వాటిని ప్రయత్నించి సక్సెస్‌ అవుతారు. రోజులో ఇలాంటివి వేల సంఖ్యలో జరుగుతాయని అలెక్స్‌ తెలిపారు. అందుకు మీ జీవితంలో ముఖ్యమైన తేదీలకు సంబంధించిన వివరాలను ఎక్కడా వెల్లడించొద్దని సూచిస్తున్నారు.

* ఫిషింగ్: కొన్నిసార్లు మనకు ఆకర్షణీయమైన ఆఫర్స్‌ అంటూ ఈ-కామర్స్‌ లేదా ఇతరత్రా కంపెనీల నుంచి మెయిల్స్‌ వస్తుంటాయి. అవి చూడటానికి కంపెనీ నుంచి వచ్చిన మెయిల్స్‌లా ఉండటం.. ఆఫర్ పేరుతో ఆకర్షణీయంగా ఉండటంతో మనం వాటిని ఓపెన్ చేస్తాం. కానీ వాటిలో చాలా వరకు నకిలీ మెయిల్స్‌ ఉంటాయి. మనం ఆఫర్‌కు ఆకర్షితులై మెయిల్‌ తెరిస్తే మన డేటా మొత్తం హ్యాకర్స్‌ చేతికి చేరిపోతుంది. అందుకే అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిదంటున్నారు.

* మల్టీ-ఫాక్టర్‌ అథెంటికేషన్ (ఎమ్‌ఎఫ్‌ఏ): ఇది కూడా సురక్షితం కాదని అలెక్స్‌ తెలిపారు. మనలో చాలా మంది మెయిల్స్‌ చెక్ చేసుకునేందుకు పాస్‌వర్డ్‌తో పాటు ఫోన్‌ నంబర్‌కి వచ్చిన కోడ్‌ని ఎంటర్‌ చేసి లాగిన్‌ అవుతాం. దీనినే ఎమ్‌ఎఫ్‌ఏ అంటారు. పాస్‌వర్డ్‌ లాగిన్‌ కోసం పంపే కోడ్‌లు ఎస్సెమ్మెస్‌ లేదా వాయిస్‌ ఆధారంగా ఉంటాయి. వీటిని ఎన్‌క్రిప్షన్ లేకుండా డిజైన్ చేస్తారని.. దాని వల్ల నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ ద్వారా వాటిని హ్యాక్‌ చేసే అవకాశం ఉందని తెలిపారు.   

మరి ఈ సమస్యకు పరిష్కారం?

ఈ సమస్యను అధిగమించడానికి ఫింగర్‌ప్రింట్ అథెంటికేషన్‌ లేదా వాయిస్‌, ఫేస్ ఐడెంటిఫికేషన్‌ ఉపయోగించాలని కాలిఫోర్నియాకు చెందిన సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకుంటే వాయిస్‌, ఫేస్‌ రికగ్నిషన్ సాంకేతిక సంబంధించిన సమాచారం ఎక్కువ శాతం యూజర్ డివైజ్‌లో సంక్షిప్తమై ఉంటాయి. పాస్‌వర్డ్స్‌ అయితే యూజర్ డివైజ్‌తో పాటు సర్వర్స్‌లో కూడా ఉంటాయి. దాని వల్ల సర్వర్‌పై సైబర్‌ దాడి జరిగితే పాస్‌వర్డ్స్‌కి సంబంధించిన సమాచారం మొత్తం హ్యాకర్స్‌ చేతికి చేరిపోతుంది. ఫింగర్‌ప్రింట్, వాయిస్, ఫేస్‌ రికగ్నిషన్‌ పాస్‌వర్డ్స్‌తో హ్యాక్‌ చేయడం కష్టమని తెలిపారు. పాస్‌వర్డ్స్‌ ఎప్పుడూ అక్షరాలు, సింబల్స్‌, పంక్చువేషన్‌ కలయిగా ఉండాలని, తరచుగా వాటిని మారుస్తూ ఉండాలని సూచిస్తున్నారు.

అలానే ఒకసారి ఉపయోగించిన పాస్‌వర్డ్‌ని మరోసారి వాడకూడదట. వేర్వేరు ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్‌ ఉపయోగించొద్దని సూచించారు. అలానే ఎమ్‌ఎఫ్‌ఏలకి ప్రత్యామ్నాయంగా యాప్‌ ఆధారిత అథెంటికేషన్‌ని ఉపయోగించాలని సూచించారు. మైక్రోసాఫ్ట్‌ అథెంటికేటర్‌, గూగుల్ అథెంటికేటర్‌లు యాప్‌ ఆధారంగా పనిచేస్తాయని, వీటికి నెట్‌వర్క్‌తో సంబంధం లేదని తెలిపారు. అలానే వీటిలోని కోడ్స్‌ కాలపరిమితి తక్కువ ఉంటడం వల్ల పరిమిత సమయం తర్వాత పనిచేయవు. దాంతో వీటిని తెలుసుకున్నా ఉపయోగించి ప్రయోజనం లేదని తెలిపారు.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని