Updated : 01/09/2020 10:40 IST

ఆండ్రాయిడ్ ఫోన్లకు మైక్రోసాఫ్ట్‌ ‘డిఫెండర్‌’

ఇంటర్నెట్‌డెస్క్: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సెక్యూరిటీ యాప్ మైక్రోసాఫ్ట్‌ డిఫెండర్‌ను ఆండ్రాయిడ్, లైనెక్స్‌ వినియోగదారులకు అందుబాటులోకి  తీసుకురానున్నట్లు గతంలో సంస్థ ప్రకటించింది. తాజాగా ‘‘మైక్రోసాఫ్ట్ డిఫెండర్‌ అడ్వాన్స్‌ థ్రెట్ ప్రొటెక్షన్’’ (ఏటీపీ)పేరుతో ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో ఉంచారు. అయితే మైక్రోసాఫ్ట్ 365 ఈ5 లైసెన్స్‌ ఉన్న సంస్థలు మాత్రమే సాఫ్ట్‌వేర్ ప్రివ్యూ కింద  దీనిని పరీక్షించేందుకు అనుమతించారు.  

ప్లేస్టోర్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం ‘‘కంపెనీల సమాచారం దొంగిలించాలని ప్రయత్నించే హానికరమైన యాప్‌లు, వెబ్‌సైట్లు, సైబర్‌ దాడుల నుంచి మైక్రోసాఫ్ట్ డిఫెండర్‌ ఏటీపీ రక్షణ కల్పిస్తుంది. సైబర్‌ దాడులను నిరోధించడంతో పాటు, వాటిపై దర్యాప్తు చేసేందుకు కూడా సెక్యూరిటీ బృందాలకు ఇది వేదికగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. దాంతో పాటు ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న అన్ని రకాల ఆండ్రాయిడ్ యాప్‌లను ఇది స్కాన్‌ చేస్తుంది. అయితే ఆండ్రాయిడ్ ఓఎస్‌లో ఇది ఎలా పనిచేస్తుందనేది తెలియకపోయినప్పటికీ ఇందులో వెబ్‌ఫిల్టర్‌లు ఉన్నట్లు తెలిపారు.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని