మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ @ ఇక అందులో పనిచేయదట!

ఆన్‌లైన్ సమావేశాల కోసం ఉపయోగించే మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ సేవలు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 ఉపయోగించేవారికి సోమవారం నుంచి నిలిచిపోనున్నాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. మైక్రోసాఫ్ట్ టీమ్స్ సేవలను తిరిగి పొందేందుకు యూజర్స్...

Published : 02 Dec 2020 15:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్ సమావేశాల కోసం ఉపయోగించే మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ సేవలు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 ఉపయోగించేవారికి సోమవారం నుంచి నిలిచిపోనున్నాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. మైక్రోసాఫ్ట్ టీమ్స్ సేవలను తిరిగి పొందేందుకు యూజర్స్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ను తమ బ్రౌజర్‌గా ఉపయోగించాలని సూచించింది. గూగుల్ క్రోమ్‌కు పోటీగా ఐదేళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ బ్రౌజర్‌ను తీసుకొచ్చింది. అయితే ఇతర బ్రౌజర్లకు దీటుగా ఎడ్జ్‌లో ఇటీవలే కీలక మార్పులు చేశారు. ఎడ్జ్‌ను ఉపయోగించేలా యూజర్స్‌ని ప్రోత్సహించేందుకు వచ్చే ఏడాది ఆగస్టు నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సేవలు పూర్తిస్థాయిలో నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. యూజర్స్ అందరు ఎడ్జ్‌ సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది.

నవంబరు 13 నుంచి కార్పొరేట్‌ కస్టమర్స్‌కి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ తమ సేవలను నిలిపివేసింది. ప్రతి ఒక్కరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ ఉపయోగించాలనే సమాచారాన్ని అందించింది. తాజాగా నవంబరు 30 నుంచి టీమ్స్‌తో సహా ఇతర మైక్రోసాఫ్ట్ వెబ్ అప్లికేషన్లు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో పనిచేయవని తెలిపింది. దాంతో పాటు ఎడ్జ్ లెగసీ డెస్క్‌ టాప్ యాప్ సేవలను వచ్చే ఏడాది మార్చి 9 నుంచి నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఒక వేళ యూజర్స్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ ఓపెన్ చేసినా ఎడ్జ్‌ బ్రౌజర్‌కి రీ-డైరెక్ట్ చేస్తూ డెస్క్‌టాప్ సూచనలు కనిపిస్తాయని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని