రెడ్‌మీ, శాంసంగ్‌ ఫోన్లకు పోటీగా ‘మోటో ఈ7’

మోటోరోలా బడ్జెట్ ఫోన్ శ్రేణిలో కొత్త మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. మోటో ఈ7 పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌తో తన మార్కెట్‌ను మరింత విస్తృతం చేసుకోవాలని మోటోరోలా భావిస్తోంది....

Updated : 05 Aug 2022 16:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మోటోరోలా బడ్జెట్ ఫోన్ శ్రేణిలో కొత్త మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. మోటో ఈ7 పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌తో తన మార్కెట్‌ను మరింత విస్తృతం చేసుకోవాలని మోటోరోలా ఆశిస్తోంది. వాటర్‌డ్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌, డ్యూయల్ రియర్‌ కెమెరా వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెడ్‌మీ 9 ప్రైమ్‌, శాంసంగ్ గెలాక్సీ ఎం11, రియల్‌మీ నార్జో 20 వంటి మోడల్స్‌తో మోటో ఈ7 పోటీపడనుంది.

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.5 అంగుళాల హెచ్‌డీ+ మాక్సీ విజన్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్ క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ7లో మూడు కెమెరాలు ఉన్నాయి. వెనక 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌ కెమెరాతో పాటు 2ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. వీటిలో నైట్ విజన్‌, ఆటో స్మైల్ క్యాప్చర్, పొట్రెయిట్ మోడ్, స్పాట్ కలర్, హై రిజల్యూషన్ జూమ్, స్లో మోషన్ వీడియో వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4జీబీ ర్యామ్‌/ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ ధర రూ. 9,499. మిస్టీ బ్లూ, ట్విలైట్ ఆరేంజ్‌ రంగుల్లో లభిస్తుంది. సెప్టెంబరు 30 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని