Updated : 09/09/2020 13:10 IST

ఈసారి ‘టెక్‌ పండగ’లో ఏం తీసుకొచ్చారంటే?

ఐఎఫ్‌ఏ (IFA).. యూరప్‌లోనే అతిపెద్ద కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌ ప్రదర్శన. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో సెప్టెంబరు 2 నుంచి సెప్టెంబరు 5 వరకు జరిగింది. ఏటా వేలాది మందితో అట్టహాసంగా జరిగే ఈ ప్రదర్శన కరోనా మహమ్మారి వల్ల ఆన్‌లైన్‌ వేదికగా జరిగింది. కొత్త ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు, టీవీలు, స్మార్ట్‌ గృహోపకరణాలు లాంటి ఎన్నో ఉత్పత్తులను అక్కడ ప్రదర్శించారు. అవేంటో చూద్దామా!

మూడు సైజుల్లో ఫిలిప్స్‌

ఫిలిప్స్‌ నూతన టీవీ మోడల్‌ను పరిచయం చేసింది. స్మార్ట్‌ యూజర్ల కోసం ఓఎల్‌ఈడీ+935 మోడల్‌ టీవీను తీసుకొచ్చింది. మూడు సైజుల్లో  ఈ టీవీలు విపణిలోకి రానున్నాయి. 48 అంగుళాలు,  55 అంగుళాలు, 65 అంగుళాలు సైజ్‌లో ఇవి మార్కెట్‌లోకి త్వరలో వస్తాయి. అక్టోబరులో వీటి అమ్మకాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఇవి  2400 డాలర్లు (దాదాపు రూ.1.80లక్షలు) నుంచి అందుబాటులో ఉంటాయి.
ఓఎల్‌ఈడీ+935 టీవీ ఫీచర్స్‌
* నాలుగో తరం P5 ప్రాసెసర్‌
* బౌయర్స్‌ అండ్‌ వికిన్స్‌ 3.1.2 ఛానెల్‌ స్పీకర్స్‌, డాల్బీ అట్మాస్‌
* నాలుగు వైపులా యాంబ్లీలైట్‌


శామ్‌సంగ్‌ లేజర్‌ ప్రొజెక్టర్‌

హైసెన్స్‌, ఎల్‌జీ, వ్యూసోనిక్‌ తరహాలో శామ్‌సంగ్‌ కూడా లేజర్‌ ప్రొజెక్టర్‌ విపణిలోకి వచ్చింది. ది ప్రీమియర్‌ పేరుతో 130 అంగుళాల ప్రొజెక్షన్‌ కలిగిన 4K లేజర్‌ ప్రొజెక్టర్‌ను తయారు చేసింది. ప్రపంచంలోనే ట్రిపుల్‌ లేజర్‌ టెక్నాలజీతో పనిచేసే తొలి హెచ్‌డీఆర్‌ 10 ప్లస్‌ సర్టిఫైడ్‌ ప్రొజెక్టర్‌ ఇదేనని శామ్‌సంగ్‌ ప్రకటించింది. LSP7T,LSP9T మోడల్స్ ప్రొజెక్టర్లు రెండు సైజుల్లో రానున్నాయి. వీటి ధర ఎంత అనేది అధికారికంగా వెల్లడించలేదు. అయితే యూఎస్‌, యూరప్‌, కొరియా దేశాల్లో ఈ ఏడాది తర్వాతే ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


5g ల్యాపీ... మడతపెట్టేయచ్చు

వచ్చే కాలమంతా 5Gదే. మొబైల్స్‌లోనే కాదు ల్యాప్‌టాప్‌లలో కూడా. మీరు 5జీ నెట్‌వర్క్‌తో పని చేసే మంచి నోట్‌బుక్‌ కోసం ఎదురు చూస్తుంటే... మీలాంటి వారి కోసమే ఏసర్‌ సంస్థ కొత్త నోట్‌బుక్‌ను తీసుకురాబోతుంది. ‘స్పిన్‌ 7’ ఈ ల్యాపీ రాబోతోంది. క్వాల్‌కోమ్‌ న్యూ స్నాప్‌డ్రాగన్‌ 8cx జెన్‌2 5G ప్రాసెసర్‌తో ఈ ల్యాపీ‌ మార్కెట్లోకి రానుంది.  ఈ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి ల్యాప్‌టాప్‌ ఇది కావడం గమనార్హం. స్నాప్‌డ్రాగన్‌ X55 5G మోడమ్‌-ఆర్‌ఎఫ్‌ సిస్టమ్‌, సబ్‌-6GHz, ఎంఎంవేవ్‌ ఫ్రీక్వెన్సీ, 5G కనెక్టవిటీతో వస్తుంది. ఏసర్‌ సంస్థ తీసుకురాబోతున్న మొట్టమొదటి 5G ల్యాపీ 14 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్‌ టచ్‌ డిస్‌ప్లేతో ఉంటుంది. ల్యాపీని వెనక్కి ముందుకు మడత పెట్టేయడం దీని ప్రత్యేకత.. 


శామ్‌సంగ్‌ కొత్తగా మూడు

నాజూకైన, తక్కువ బరువు కలిగిన ల్యాప్‌టాప్స్‌ కోసం ఇంటెల్‌ 11th జనరేషన్‌ ‘టైగర్‌ లేక్‌’ ప్రాసెసర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇదే అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు శామ్‌సంగ్‌ తొలి అడుగు వేసింది. కొత్త ప్రాసెసర్‌ అడాప్టర్‌తో గెలాక్సీ బుక్‌ ఫ్లెక్స్‌ 5G ల్యాప్‌టాప్‌ను విపణిలోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 16 జీబీ ర్యామ్‌తో 13.3 అంగుళాల FHD డిస్‌ప్లే ఉంటుంది. సబ్‌-6GHz 5G కనెక్షన్‌ సపోర్ట్‌ చేస్తుంది.

హెల్త్‌కు సంబంధించి గెలాక్సీ FIT 2 స్మార్ట్‌ బ్యాండ్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. గతేడాది వచ్చిన గెలాక్సీ FIT బ్యాండ్‌కు అదనపు ఫీచర్లను యాడ్‌ చేసి FIT 2 తీసుకొస్తున్నారు. గెలాక్సీ FIT 2 స్మార్ట్‌బ్యాండ్ బ్యాటరీ  దాదాపు రెండు వారాలు నిలుస్తుంది. గెలాక్సీ FIT స్మార్ట్‌బ్యాండ్‌ అల్యూమినియం డిజైన్‌తో రాగా..  FIT 2 సిలికాన్‌ బాడీ, స్ట్రాప్‌తో వస్తుంది. ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లో స్లీప్‌, యాక్టివిటీ, హార్ట్ ‌రేట్‌ ట్రాకింగ్‌ లాంటి ఫీచర్స్‌ ఉన్నాయి. దీని ధర, మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందనే దానిపై అధికారికంగా తెలియాల్సి ఉంది. 

స్మార్ట్‌ఫోన్ల విపణిలోకి శాంసంగ్‌ మరో కొత్త ఫోన్‌ను తీసుకురాబోతుంది. ఇంతకుముందు వచ్చిన  గెలాక్సీ Z FOLDకు అడ్వాన్స్‌డ్‌గా  గెలాక్సీ ‘Z FOLD 2’ వస్తోంది. ఈ 5G ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌లో రెండు డిస్‌ప్లేలు ఉంటాయి. మడత పెట్టినప్పుడు తొలి డిస్‌ప్లే 6.2 అంగుళాలతో 2260×816 రిజల్యూషన్‌ కలిగి ఉంటుంది. ఫోన్‌ను ఓపెన్‌ చేసినప్పుడు మొబైల్‌... ట్యాబ్‌గా మారిపోతుంది. అప్పుడు 7.6 అంగుళాల డైనమిక్‌ AMOLED డిస్‌ప్లేతో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 865+ ప్రాసెసర్‌, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ యూఎఫ్‌ఎస్‌ 3.1 ఫ్లాష్‌ స్టోరేజ్‌ ఉంటాయి. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికే కొన్ని దేశాల్లో ప్రి-ఆర్డర్‌ ద్వారా అందుబాటులో ఉంది. 18 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. 


శామ్‌సంగ్‌కు పోటీగా ఆసుస్‌


 

మొబైల్‌ రంగంలోనే కాకుండా ల్యాప్‌టాప్‌ల విషయంలోనూ శామ్‌సంగ్‌కు పోటీనిచ్చేందుకు ఆసుస్‌ తన కొత్త ఉత్పత్తిని విడుదల చేయబోతుంది. ఇన్‌టెల్‌ 11TH జనరేషన్‌ ప్రాసెసర్‌తో శామ్‌సంగ్‌ 5G ల్యాప్‌టాప్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అలానే ఆసుస్‌ కూడా Evo కోర్‌ i7 ప్రాసెసర్‌, ఐరిస్‌ Xe గ్రాఫిక్స్‌తో ZenBook Flip S ల్యాపీని విడుదల చేస్తోంది. 13 అంగుళాల డిస్‌ప్లేతో ప్రపంచంలోనే అత్యంత నాజూకైన (13.9 ఎంఎం) ల్యాప్‌టాప్‌ను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. 4k OLED డిస్‌ప్లేతో ఉండే ఈ ల్యాపీ బరువు కేవలం 2.6 పౌండ్లు (సుమారు 1.150కేజీలు) మాత్రమే. 16జీబీ ర్యామ్‌, 1టీబీ PCle SSD ఉంటాయి. ధర ఎంతనేది తెలియని ఈ ల్యాపీ అక్టోబరులో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. 


లెనోవో స్మార్ట్‌ క్లాక్‌

లెనోవో గూగుల్‌ అసిస్టెంట్‌ అప్‌గ్రేడ్‌తో  స్మార్ట్ క్లాక్‌ను గతేడాది విడుదల చేసింది. ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్స్‌తో స్మార్ట్‌ క్లాక్‌ ఎసెన్షియల్‌ను తీసుకు వస్తున్నట్లు లెనోవో ప్రకటించింది. 4 అంగుళాల ఎల్‌ఈడీ డిస్‌ప్లే, క్లాక్‌ పైభాగంలో కంట్రోల్‌ బటన్స్ ఉన్నాయి. వాయిస్‌ ఆపరేటెడ్ స్మార్ట్‌ క్లాక్‌కు 3W స్పీకర్‌ ఉంది. ఉష్ణోగ్రత, వాతావరణ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చని లెనోవో వెల్లడించింది. యూఎస్‌బీ కనెక్షన్‌ ఉండటం వల్ల వేరే డివైస్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు. వచ్చే నెలలో వీటి సేల్స్‌ను ప్రారంభించనున్నారు. తెలిపింది. దీని ధర 49.99 డాలర్లు (దాదాపు రూ.3,750).


 

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని