వాట్సాప్‌ మెసేజ్‌ డిలీట్‌.. మీరు కోరినప్పుడు!

ప్రముఖ చాటింగ్‌ వాట్సాప్‌ రోజు రోజుకూ సరికొత్త అప్‌డేషన్స్‌తో యూజర్ల ముందుకొస్తోంది. వినియోగ దారుల సమాచార భద్రతే ప్రాధాన్యంగా రకరకాల ఫీచర్లను అందిస్తోంది. ఇప్పటికే అనుమతిలేకుండా ఇతరులు మీ వాట్సాప్ అకౌంట్‌లో లాగిన్‌ అవ్వకుండా ఫింగర్‌ ప్రింట్‌ ఆప్షన్‌ను అందుబుటులోకి తెచ్చిన వాట్సాప్‌.. మరిన్ని ఫీచర్ల కోసం కసరత్తు...

Updated : 22 Sep 2020 13:45 IST

ఇంటర్నెట్‌డెస్క్: వాట్సాప్‌ రోజు రోజుకూ సరికొత్త ఫీచర్అ‌ప్‌డేట్స్‌తో యూజర్ల ముందుకొస్తోంది. వినియోగదారుల సమాచార భద్రతే ప్రాధాన్యంగా రకరకాల ఫీచర్లను అందిస్తోంది. ఇప్పటికే అనుమతిలేకుండా ఇతరులు మీ వాట్సాప్‌లో లాగిన్‌ అవ్వకుండా ఫింగర్‌ ప్రింట్‌ అథెంటికేషన్‌ ఆప్షన్‌‌ను అందుబుటులోకి తెచ్చిన వాట్సాప్‌.. మరిన్ని ఫీచర్లపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వాట్సాప్‌లో పంపిన వీడియోలను, టెక్స్‌మెసేజ్‌లు, ఇమేజ్‌లు, ఫైల్స్‌, ఎమోజీలను నిర్ణీత సమయంలో అవతలి వాళ్ల ఫోన్‌ నుంచి డిలీట్‌ చేసే అవకాశం ఇప్పటికే ఉంది. ఆ సమయం తర్వాత డిలీట్‌ చేయడం కుదరదు. దీనిని అధిగమించడానికి మరో ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా అవతలి వాళ్ల వాట్సాప్‌కు మనం పంపిన సమాచారం ఎప్పుడు డిలీట్‌ చెయ్యాలా? అనేది ఎంచుకునేలా సెల్ఫ్‌ డిస్ట్రక్టింగ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. 

ఉదాహరణకు మీరు పంపిన డేటా అవతలి వ్యక్తి ఫోన్‌లో 10 నిమిషాల తర్వాత డిలీట్‌ అవ్వాలంటే సెండ్‌ బటన్‌ పక్కనున్న టైమర్‌లో ఆ సమయం సెలెక్ట్‌ చేసుకోవల్సి ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ సమయం తర్వాత మెసేజ్‌ అవతలి ఫోన్‌ నుంచి డిస్‌అపియర్‌ అవుతుంది. ఇప్పటికే ఈ తరహా ఆప్షన్‌ ఇన్‌స్టాగ్రామ్‌,ఫేస్‌బుక్‌ మెసెంజర్లలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా చాట్‌ నుంచి బయటకు వస్తే ఆటోమేటిగ్గా మీరు పంపిన డేటా అంతా డిలీట్‌ అయ్యేలా కూడా వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఇది ఇన్‌కాగ్నిటో బ్రౌజర్‌ తరహాలో ఉంటుంది. తొలుత ఈ ఫీచర్లను బీటా యూజర్లకు అందుబాటులోకి తెచ్చి ఆ తర్వాత స్టేబుల్‌యాప్‌లో అప్‌డేట్‌ చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని