ఒప్పో కొత్త ఓఎస్‌ వివరాలు ఇవే.. 

టెక్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒప్పో కలర్‌ ఓఎస్‌ 11 విడదల తేది ఖరారైంది. సెప్టెంబరు 14న ప్రపంచవ్యాప్తంగా ఈ ఓఎస్‌ను విడుదల చేయనున్నట్లు ఒప్పో తెలిపింది....

Published : 09 Sep 2020 22:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒప్పో కలర్‌ ఓఎస్‌ 11 విడదల తేదీ ఖరారైంది. సెప్టెంబరు 14న ప్రపంచవ్యాప్తంగా ఈ ఓఎస్‌ను విడుదల చేయనున్నట్లు ఒప్పో తెలిపింది. మేక్‌ లైఫ్ ఫ్లో (Make Life Flow) పేరుతో లోగో కూడా విడుదల చేసింది. ఆండ్రాయిడ్‌ 11 ఆధారంగా పనిచేసే ఈ కలర్‌ ఓఎస్‌ 11 ఇప్పటికే ఎంపిక చేసిన యూజర్స్‌కి అప్‌డేట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను విడుదల చేసిన వెంటనే ఒరిజనల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్‌ (ఓఈఎమ్) భాగస్వాములైన ఒప్పొ, వన్‌ప్లస్‌, రియల్‌మీ, షావోమీ కంపెనీలు కూడా తమ బీటా వెర్షన్ ఓఎస్‌ విడుదలను ప్రకటించాయి.

ముందుగా కలర్‌ఓఎస్‌ 11ను ఒప్పో ఫైండ్ ఎక్స్‌2, రెనో 3 సిరీస్‌ యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఈ కొత్త ఓఎస్‌తో ఫోన్‌ పనితీరు మరింత మెరుగవుతుందని ఒప్పో అభిప్రాయపడింది. కలర్‌ ఓఎస్‌ 11‌లో ఫీచర్స్‌ ఇతర వివరాల గురించి కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఆండ్రాయిడ్ 11 విడుదల సందర్భంగా వన్‌టైమ్ పర్మిషన్స్‌, మెసేజ్‌ నోటిఫికేషన్స్‌, స్క్రీన్‌ రికార్డ్‌ ఫీచర్ తీసుకొస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. వీటిలో స్క్రీన్ రికార్డ్ ఫీచర్ ఇప్పటికే ఒప్పో కలర్‌ ఓఎస్‌ 7లో ఉండటం గమనార్హం. ఇవి కాకుండా ఇంకా ఏమేం ఫీచర్స్‌ రాబోతున్నాయి? కలర్‌ ఓఎస్‌ 11 గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం సెప్టెంబరు 14 వరకు ఆగాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని