Published : 30/08/2020 21:41 IST

పేటీఏం మాల్‌పై హ్యాకర్ల దాడి

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎంలో వినియోగదారులకు సంబంధించిన డేటా చోరీకి గురయినట్లు వార్తలు వెలువడ్డాయి. సంస్థకు చెందిన పేటీఎం మాల్ డేటాబేస్‌పై జాన్‌ విక్‌ అనే గ్రూప్‌కు చెందిన హ్యాకర్లు దాడి చేసినట్లు సమాచారం. తస్కరించిన డేటాను తిరిగి ఇచ్చేందుకు హ్యాకర్లు పేటీఎం మాల్ నుంచి పెద్ద మొత్తం డిమాండ్ చేస్తున్నారని సైబిల్ అనే అంతర్జాతీయ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ తెలిపింది.  ప్రముఖ సంస్థలలోని సాంకేతిక లోపాలను పరిష్కరిస్తామని చెప్పుకొంటూ ఈ హ్యాకర్లు సదరు కంపెనీల డేటా బేస్‌పై దాడి చేయడంలో ప్రసిద్ధులని సైబిల్ వెల్లడించింది.

లోపలి వ్యక్తుల సహాయంతోనే డేటా చోరీకి గురైనట్లు పేటీఎం మాల్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా డేటాను తిరిగి ఇచ్చేందుకు హ్యాకర్లు అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి పేటీఎం మాల్ అంగీకరించినట్లు సైబిల్ తెలిపింది. అయితే పేటీఎం అధికార ప్రతినిధి మాత్రం డేటా చోరీ వార్తలను ఖండించారు. ‘‘ వినియోగదారులకు సంబంధించిన డేటా భద్రంగా ఉంది. సంస్థ డేటా హ్యాకింగ్‌ గురయినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. దీనిపై అంతర్గత విచారణకు ఆదేశించాం. డేటా భద్రతకు సంబంధించి మేం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాం. అంతే కాకుండా బగ్ బౌంటీ కార్యక్రమంతో సంస్థలోని సాంకేతిక సమస్యలను గుర్తించిన వారికి ప్రోత్సహకాలు కూడా అందిస్తున్నాం. సంస్థ, వినియోగదారుల డేటా భద్రతకు సంబంధించి మేము సెక్యూరిటీ రీసెర్చ్‌ కమ్యూనిటీతో కలిసి పనిచేస్తాం’’ అని తెలిపారు.  

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని