Environmental Change: 1 డిగ్రీ వేడి = 5% వాన

దక్షిణ తీరప్రాంతంలో మామూలు కన్నా 29% ఎక్కువ వర్షాలు. అదే ఈశాన్య భారతంలో 14% తక్కువ వర్షాలు. గత నెలలో మనదేశంలో కురిసిన వర్షాల ధోరణి ఇది. నిజంగా ఇది అసాధారణమే. ఎందుకంటే

Updated : 11 Aug 2021 16:40 IST

క్షిణ తీరప్రాంతంలో మామూలు కన్నా 29% ఎక్కువ వర్షాలు. అదే ఈశాన్య భారతంలో 14% తక్కువ వర్షాలు. గత నెలలో మనదేశంలో కురిసిన వర్షాల ధోరణి ఇది. నిజంగా ఇది అసాధారణమే. ఎందుకంటే మామూలుగా ఈశాన్య భారతంలోనే ఎక్కువ వర్షాలు పడుతుంటాయి. కొన్నిచోట్ల అత్యధిక వర్షాలు కురవటమనేది మనదేశానికే పరిమితం కాలేదు.  బెల్జియం, జర్మనీ, లక్సంబర్గ్‌, నెదర్లాండ్స్‌ వంటి దేశాల్లోనూ 2 నెలల వర్షం కేవలం   2 రోజుల్లోనే కురిసింది. ఇది పెరుగుతున్న భూతాపం, వాతావరణ మార్పుల ఫలితమే. వాతావరణంలో ప్రతీ డిగ్రీ సెల్షియస్‌ ఉష్ణోగ్రత పెరుగుదలతో గాల్లో సగటున 6-7% తేమ ఎక్కువవుతుంది. ఇది పెద్ద మేఘాలు ఏర్పడటానికి, భారీ వర్షాలు కురవటానికి దారితీస్తుంది. వాతావరణ ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్షియస్‌ పెరిగితే నైరుతి రుతుపవన కాలంలో సుమారు 5% వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశముంది. అత్యధిక వర్షాలే కాదు.. కొన్ని అతి చల్లటి ప్రాంతాల్లోనూ కార్చిచ్చులు రేగటం, వేడిగాలులు వీయటం వంటివీ వాతావరణ మార్పు ఫలితాలే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని