Realme Magdart: తొలి ఆండ్రాయిడ్‌ వైర్‌లెస్‌ మాగ్నెటిక్‌ ఛార్జర్‌

రియల్‌మీ సంస్థ కొత్త స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మీ ఫ్లాష్‌తో కొత్త హంగామా కూడా మొదలుకానుంది. ఫోన్‌తో పాటు వైర్‌లెస్‌ మాగ్నెటిక్‌ ఛార్జర్‌ కూడా వస్తుండటమే దీనికి కారణం. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్ల విషయానికి

Updated : 04 Aug 2021 16:46 IST

రియల్‌మీ సంస్థ కొత్త స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మీ ఫ్లాష్‌తో కొత్త హంగామా కూడా మొదలుకానుంది. ఫోన్‌తో పాటు వైర్‌లెస్‌ మాగ్నెటిక్‌ ఛార్జర్‌ కూడా వస్తుండటమే దీనికి కారణం. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్ల విషయానికి వస్తే ఇదే మొట్టమొదటి మాగ్నెటిక్‌ వైర్‌లెస్‌ ఛార్జర్‌ మరి. దీనిపేరు మాగ్‌డార్ట్‌. యాపిల్‌ మాగ్‌సేఫ్‌ తరహాలోనే దీన్ని రూపొందించారు. చిన్న పెట్టె మాదిరిగా ఉండే ఇది ఫోన్‌ వెనకాలే అతుక్కుపోయి ఛార్జ్‌ చేస్తుంది. యాపిల్‌ మాగ్‌సేఫ్‌ కన్నా 440% ఎక్కువ వేగంతో ఛార్జ్‌ చేస్తుందని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే 81వాట్ల వేగంతో ఛార్జ్‌ చేస్తుందని అనుకోవచ్చు. అందుకే ప్రపంచంలోనే ఇదే అత్యంత వేగంగా ఛార్జ్‌ చేసే మాగ్నెటిక్‌ ఛార్జర్‌ కావొచ్చనీ భావిస్తున్నారు. వేడెక్కకుండా దీనికి ఫ్యాన్‌, వేడి బయటకు వెళ్లిపోవటానికి రంధ్రాలు కూడా ఉన్నాయి. వైర్‌లెస్‌గానే ఛార్జర్‌, ఫోన్‌ అనుసంధానమైనప్పటికీ నిరంతరం ఛార్జ్‌ చేస్తుండాలంటే యూసీబీ టైప్‌ సి కనెక్షన్‌ కూడా అవసరమవ్వచ్చు. దీని అయస్కాంత అటాచ్‌మెంట్‌కు వాలెట్‌నూ జోడించుకోవచ్చు. ఇందులో మూడు క్రెడిట్‌ కార్డులను పెట్టుకోవటానికి చోటుంటుంది. అవసరమైతే ఫోన్‌ స్టాండ్‌గానూ ఉపయోగించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని