IQ Test: మన ఐక్యూ పరీక్ష

తెలివితేటలను (ఐక్యూ) పరీక్షించటం ఎప్పుడూ ఆసక్తి కలిగించేదే. దీన్ని వివిధ కోణాల్లో అర్థం చేసుకోవటానికి, లెక్కించటానికి సైకాలజిస్టులు నిరంతరం ప్రయత్నిస్తూనే వస్తున్నారు. ప్రస్తుతం మనదేశంలో ఐక్యూ

Updated : 29 Jul 2021 16:17 IST

విజ్ఞానం

తెలివితేటలను (ఐక్యూ) పరీక్షించటం ఎప్పుడూ ఆసక్తి కలిగించేదే. దీన్ని వివిధ కోణాల్లో అర్థం చేసుకోవటానికి, లెక్కించటానికి సైకాలజిస్టులు నిరంతరం ప్రయత్నిస్తూనే వస్తున్నారు. ప్రస్తుతం మనదేశంలో ఐక్యూ పరీక్షలకు ఉపయోగిస్తున్న పద్ధతులన్నీ పాశ్చాత్య ధోరణులనే అనుసరిస్తున్నాయి. మన ప్రాంత, సామాజిక పరిస్థితులకు తగినట్టుగానే లేకపోయినా ఇవి తప్ప మరో దిక్కు లేదు. ఇకపై అలా నిట్టూర్చాల్సిన పనిలేదు. మన అవసరాలకు తగిన, మనదైన ఐక్యూ పరీక్ష అందుబాటులోకి వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్‌ అల్బర్టాలో పనిచేస్తున్న సైకాలజీ  ప్రొఫెసర్‌ జె.పి.దాస్‌ నేతృత్వంలోని విద్యావేత్తలు, క్లినికల్‌ సైకాలజిస్టుల బృందం దీన్ని రూపొందించింది. ఆలోచన స్థాయి దగ్గర్నుంచి పరీక్షను అభివృద్ధి చేయటం వరకూ అంతా మనదగ్గరే సాగింది. ఈ నమూనాను 5 నుంచి 20 ఏళ్ల వయసు వారిపై పరీక్షించి చూశారు కూడా. బ్రెయిన్‌ బేస్డ్‌ ఇంటెలిజెన్స్‌ టెస్ట్‌ (బీబీఐటీ) అనే పేరుతో పిలుచుకుంటున్న ఇది తెలివితేటలను, విషయగ్రహణ సామర్థ్యాన్ని లెక్కిస్తుంది. పక్షవాతం, మూర్ఛ, మెదడుకు దెబ్బలు తగలటం వంటి వాటితో మెదడు పనితీరు ఎంతవరకు తగ్గిందనేది తెలుసుకోవటానికీ ఇది తోడ్పడుతుంది. అవసరమైనప్పుడు మనం పరిస్థితులకు తగ్గట్టుగా మారాల్సి ఉంటుంది. మెదడు కూడా ఇందుకు అనుగుణంగా మారిపోతుంది. ఇలాంటి సామర్థ్యాలనూ తాజా పరీక్ష లెక్కించగలదు. సామాజిక సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు, ఏకాగ్రత, హేతుబద్ధత సామర్థ్యాల వంటి వాటి విషయంలో లోతైన సమాచారాన్ని అందిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని