Smart Stick: స్మార్ట్‌ ఊతకర్ర

డిమెన్షియా ముదురుతున్నకొద్దీ జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం తగ్గుతుంటాయి. దీంతో రోజువారీ పనుల తీరూ మారిపోతుంది. వీరిని ఎవరో ఒకరు నిరంతరం కనిపెట్టుకోవాల్సి రావొచ్చు. కొన్నిసార్లు ఇది ..

Updated : 11 Aug 2021 16:41 IST

డిమెన్షియా ముదురుతున్నకొద్దీ జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం తగ్గుతుంటాయి. దీంతో రోజువారీ పనుల తీరూ మారిపోతుంది. వీరిని ఎవరో ఒకరు నిరంతరం కనిపెట్టుకోవాల్సి రావొచ్చు. కొన్నిసార్లు ఇది ఆత్మ విశ్వాసం సన్నగిల్లటానికి, మునుపటిలా స్వతంత్రంగా జీవించలేకపోతున్నామనే భావనకూ దారితీస్తుంటుంది. కుటుంబ సభ్యులు కూడా అన్నిసార్లూ వెంట ఉండటం కుదరకపోవచ్చు. మరెలా? ఇలాంటి పరిస్థితుల్లో సాయం చేయటానికే పరిశోధక విద్యార్థి జేమ్స్‌ బేలిస్‌ ఓ స్మార్ట్‌ ఊతకర్రను రూపొందించారు. దీనిపేరు ఎయిడీ. సాయం చేసేదన్నమాట. బ్లూటూత్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. ఇంట్లో డిమెన్షియా బాధితుల రోజువారీ కదలికలను పసిగట్టి, నమోదు చేస్తుంది. వీటిని బట్టి మెషిన్‌ లెర్నింగ్‌ సాయంతో ‘ప్రవర్తన పటం’ రూపొందిస్తుంది. బాత్రూమ్‌లో ఎక్కువసేపు ఉండిపోవటం, కింద పడిపోవటం వంటి అసాధారణ ప్రవర్తనను గుర్తిస్తే వెంటనే యాప్‌ ద్వారా సన్నిహితులను హెచ్చరిస్తుంది. వెంటనే అప్రమత్తమయ్యేలా చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని