Twitter: ‘బ్లూ టిక్‌’ అప్లికేషన్‌.. రిజెక్ట్‌ అయితే?

ఈ మధ్యకాలంలో ప్రముఖులు ఎక్కువగా ఇంటరాక్ట్‌ అయ్యే మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌. చాలామంది తమ ట్విటర్‌ ఖాతాకు బ్లూ టిక్‌ రావాలని కోరుకుంటూ ఉంటారు. బ్లూ టిక్‌ బ్యాడ్జ్‌ ఉండటం వల్ల...

Updated : 15 Jul 2021 10:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ మధ్యకాలంలో ప్రముఖులు ఎక్కువగా ఇంటరాక్ట్‌ అవుతున్న మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌. చాలామంది తమ ట్విటర్‌ ఖాతాకు బ్లూ టిక్‌ రావాలని కోరుకుంటూ ఉంటారు. బ్లూ టిక్‌ బ్యాడ్జ్‌ ఉండటం వల్ల వెరిఫైడ్‌, అథెంటిక్‌, పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ ఖాతాగా అవడంతోపాటు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. ట్విటర్‌ ఖాతాకు బ్లూ టిక్‌ బ్యాడ్జ్ కేటాయించాలని యూజర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. నియమ నిబంధనలు పాటించే వారి వివరాలను ట్విటర్‌ వెరిఫై చేసి బ్లూ టిక్‌ కేటాయిస్తూ ఉంటుంది. ఒకవేళ మీ రిక్వెస్ట్‌ను ట్విటర్‌ రిజెక్ట్‌ చేస్తే దానికి కారణాలు గతంలో వెల్లడించేది కాదు. అయితే ఇప్పుడు నిబంధనలను మార్చింది.

ఎందుకు రిజెక్ట్‌ అయ్యిందంటే..?

బ్లూటిక్‌ కేటాయించాలనే అప్లికేషన్‌ను ఎందుకు రిజెక్ట్‌ చేశామో ఈ-మెయిల్‌ ద్వారా ట్విటర్‌ యూజర్‌కు సమాధానం పంపిస్తుంది. అంతేకాకుండా నెల రోజుల వ్యవధిలో మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ‘వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు అప్రూవ్‌ కాలేదో సవివరంగా నివేదిస్తాం. తమ క్రిటేరియాను చేరుకునేందుకు అవసరమైన కంటెస్ట్‌ను సూచిస్తాం’’ అని ట్విటర్‌ పేర్కొంది. బ్లూ టిక్‌ కోసం పునఃదరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన జాబితాను ట్విటర్‌ షేర్‌ చేసింది. గతంలో ఏ విభాగంలో తప్పు చేశారో తెలుసుకుని మార్పులు చేసుకోవాలని సూచించింది.

అవేంటో ఓసారి చూద్దాం..

* మీరు ఏదైనా వెబ్‌సైట్‌ తరఫున అప్లై చేస్తే.. ఆ ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ వెరిఫైడ్‌ ఆర్గనైజేషన్‌కు చెంది ఉండాలి. 
* అలానే మీ పేరు, మీ ట్విటర్‌ ఖాతాను కూడా వెబ్‌సైట్‌ రిఫర్‌ చేయాలి
* ఒకవేళ మీరు ఏదైనా కంపెనీ/బ్రాండ్‌/ ఆర్గనైజేషన్‌కు కార్యకర్త లేదా ప్రభావశీలురు అయితే వెరిఫైడ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
* అయితే మీరు ఉండే ప్రాంతంలోని యాక్టివ్‌ అకౌంట్స్‌లో మిమ్ముల్ని ఫాలో అయ్యే వారి సంఖ్య కనీసం 0.05 శాతం ఉండాలి
* ఒకవేళ మీరు జర్నలిస్ట్‌ అయితే.. ట్విటర్‌ ఫ్రొఫైల్‌ వార్తా సంస్థకు అనుబంధంగా ఉండాలంటే తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్‌కు లింక్‌ అయి ఉండాలి. అలానే మిమ్ముల్ని న్యూస్‌ ఆర్గనైజేషన్‌ రిఫర్‌ చేస్తేనే ట్విటర్‌ నిబంధనల ప్రకారం బ్లూ టిక్‌ బ్యాడ్జ్‌ వచ్చే అవకాశం ఉంటుంది
* ఇతర రంగాలకు చెందిన వ్యక్తులైనప్పటికీ తప్పనిసరిగా ట్విటర్‌ నియమ నిబంధనలను పాటించి తీరాలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని