Itching Sticker: దురదను పసిగట్టే పట్టీ

ఎంత దురద పెడుతోందంటే ఏం చెబుతాం? అనుభవించినవారికే తెలుస్తుంది. నొప్పి మాదిరిగానే దీని తీవ్రతనూ మాటల్లో చెప్పలేం. దీన్ని కొలవటానికి ఎలాంటి పరికరాలూ లేవు. జ్వరం, రక్తపోటును  

Updated : 29 Jul 2021 16:26 IST

సైన్స్‌ మాయ

ఎంత దురద పెడుతోందంటే ఏం చెబుతాం? అనుభవించినవారికే తెలుస్తుంది. నొప్పి మాదిరిగానే దీని తీవ్రతనూ మాటల్లో చెప్పలేం. దీన్ని కొలవటానికి ఎలాంటి పరికరాలూ లేవు. జ్వరం, రక్తపోటును పరీక్షించినట్టుగా దురదను కొలవటానికీ వీలుంటే? ఇలాంటి కొరతను తీర్చటానికే నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఓ కొత్తరకం పట్టీని రూపొందించారు. ఇది దురద తీరుతెన్నులను, తీవ్రతను గుర్తిస్తుంది. మెత్తటి, నీటికి తడవని సెన్సర్‌తో కూడిన దీన్ని చేయి వెనకాల అతికిస్తే చాలు. ఎప్పుడెప్పుడు, ఎన్నిసార్లు గోక్కుంటున్నారనేది గుర్తించి నమోదు చేస్తుంది. గోక్కుంటున్న చేతి కదలికల వేగంతో పాటు చర్మం మీద గోళ్లు రాసుకుంటున్నప్పుడు అయ్యే చప్పుడునూ గ్రహిస్తుంది. మెషిన్‌ లెర్నింగ్‌ ఆల్గోరిథమ్‌ సాయంతో ఎప్పుడు గోక్కుంటున్నారనే విషయాన్నీ ఇది పసిగడుతుంది. తీవ్రమైన దురదతో వేధించే ఎండుగజ్జి వంటి జబ్బులకు చికిత్స చేసే డాక్టర్లకిది ఎంతగానో ఉపయోగపడుతుందనటంలో సందేహం లేదు. దీంతో దురద తీవ్రతను పసిగట్టొచ్చు. మందులు పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవచ్చు. నోటితే చెప్పలేని పిల్లల విషయంలోనైతే ఎంతగానో ఉపయోగపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని