Updated : 07 Dec 2020 15:24 IST

ఇంప్రెస్సివ్‌గా ఇమేజ్‌ రిసైజింగ్‌.. ఎలాగంటే!

అందుబాటులో వివిధ టూల్స్‌

ఫొటోలు రిసైజ్‌ చేసుకోవడం కోసం చాలా మంది ఫొటోషాప్‌.. తదితర యాప్స్‌, సాఫ్ట్‌వేర్స్‌ కోసం వెతుకుతుంటారు. కానీ అలాంటివేమీ లేకపోయినా కూడా మీరు ఇమేజ్‌ రిసైజ్‌ చేసుకోవచ్చు. ఫొటోషాప్‌ వంటి యాప్స్‌ అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లోనే కొన్ని సంస్థలు ఉచితంగా ఆ సేవలను అందిస్తున్నాయి. కేవలం రిసైజింగ్‌ మాత్రమే కాదు.. ఇమేజ్‌ ఎడిటింగ్, కంప్రెసింగ్‌, ఫిల్టరింగ్‌ సౌకర్యాల్ని కూడా కల్పిస్తున్నాయి. ఫొటోషాప్‌లో లభించే చాలా ఫీచర్లు వీటిల్లో అందిస్తున్నారు. ఉచితంగా అలాంటి సదుపాయాల్ని అందించే కొన్ని ఆన్‌లైన్‌ ఫొటోస్‌ రిసైజింగ్‌ టూల్స్‌ గురించి తెలుసుకుందాం.  

లూనాపిక్‌ రిసైజర్‌ 
ఇమేజ్‌ రిసైజర్‌ టూల్స్‌ ప్లాట్‌ఫాంలలో ఎక్కువ మంది ఉపయోగించే వాటిలో ‘లూనాపిక్‌ రిసైజర్‌’ ఒకటి. ఇందులో వందలాది ఎడిటింగ్‌ టూల్స్‌ అందుబాటులో ఉన్నాయి. గ్రాబ్‌ అండ్‌ డ్రాగ్‌ సహా పలు కస్టమైజ్డ్‌ ఫీచర్లు ఇందులో అందిస్తున్నారు. ఫొటోషాప్‌లో ఉండే ఆప్షన్‌ చాలా వరకు ఇందులో మనకు అందుబాటులో ఉంటాయి.

లూనాపిక్‌ టూల్‌ కోసం క్లిక్‌ చేయండి

వెబ్‌ రిసైజర్‌
క్రాప్‌, షార్పెన్‌, కంప్రెస్‌, రిసైజ్‌ వంటి ఫీచర్లు ఈ ప్లాట్‌ఫాం అందిస్తోంది. దాంతో పాటు ఈ వెబ్‌సైట్‌లో రకరకాల ఎడిటింగ్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మరో ప్రత్యేకత ఉంది. ఇది బల్క్‌ ఇమేజ్‌ ప్రాసెసింగ్‌కు కూడా ఉపయోగపడుతుంది. 

పిక్‌ రిసైజ్‌
‘పిక్‌ రిసైజ్‌’ అనేది ఆన్‌లైన్‌ ఫొటో రిసైజింగ్‌ టూల్‌. ఈ టూల్‌ ద్వారా ఫొటోలను ప్రీసెట్‌ పర్సెంటేజీ ఆధారంగా సైజుల్లో మార్పులు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫొటోలకు ఇతర ప్రత్యేక ఎఫెక్ట్స్‌ను సైతం యాడ్‌ చేసుకునేలా అదనపు ఫీచర్లను ఈ టూల్‌ అందిస్తోంది. ఇమేజ్‌ క్రాపింగ్‌, రొటేటింగ్‌ వంటి ఆప్షన్లను పొందవచ్చు. 

సోషల్‌ ఇమేజ్‌ రిసైజర్‌ టూల్‌
ఇది ఎక్కువగా ఫేస్‌బుక్‌, గూగుల్‌, యూట్యూబ్‌, లింక్‌డ్‌ఇన్‌, పింట్‌రెస్ట్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమ సైట్లలో ఉపయోగిస్తారు. ఇందులో కావాలనుకుంటే కస్టమ్‌ సైజ్‌ను కూడా మీరు ఇవ్వవచ్చు. ఈ టూల్‌ కోసం క్లిక్‌ చేయండి.. సోషల్‌ ఇమేజ్‌ టూల్‌.

పిక్‌ ఘోస్ట్‌
ఇందులో మీరు ఒకేసారి 40 ఫొటోలను ఎడిటింగ్‌ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇమేజెస్‌ ప్రిసెట్ రేంజ్‌‌, కస్టమ్‌ స్థాయుల్ని మార్పులు చేసుకోవచ్చు. 

క్విక్‌ థంబ్‌నెయిల్‌
‘క్విక్‌ థంబ్‌నెయిల్‌’ టూల్‌ ద్వారా క్విక్‌ ఇమేజ్‌ రిసైజింగ్‌తో పాటు, ఫిల్టరింగ్‌ ఆప్షన్లను అందిస్తుంది. ఇందులో మరో ప్రత్యేకత ఉంది. అదే వాటర్‌ మార్కు. ఎడిట్‌ చేసుకున్న ఫొటోకు వాటర్‌ మార్కును జత చేసుకుని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందులో ప్రిసెట్‌ రిసైజ్‌ నిష్పత్తి ఆప్షన్‌ ఆకట్టుకుంటుంది. వెబ్‌ యాప్స్‌, మానిటర్ల కోసం ఈ టూల్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ టూల్‌ కోసం క్లిక్‌ చేయండి క్విక్‌ థంబ్‌నెయిల్‌.

టూల్‌ యువర్‌
ఈ టూల్‌ ద్వారా ఫొటోలను కావాల్సిన సైజులోకి కంప్రెస్‌ చేసుకోవచ్చు. అందుకోసం ఈ టూల్‌లో వివిధ రకాల పద్ధతులు అందుబాటులో ఉంచారు. ఇమేజ్‌ ఎత్తు, వెడల్పుకు సంబంధించి మనకు కావాల్సిన ప్రమాణాల్ని ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇది 25 ఇమేజ్ బల్క్‌ ప్రాసెసింగ్‌కు వంటి ఫీచర్లను అందిస్తుంది.

గో టూ కన్వర్టర్
గో టూ కన్వర్టర్‌ 200 ఫార్మాట్లలో ఇది పనిచేస్తుంది. ఇందులోనూ రిసైజ్‌తో పాటు ఇమేజ్‌ కంప్రెస్‌ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇవేకాకుండా వెబ్‌రిసైజర్‌, బీఫంకీ, సింపుల్‌ ఇమేజ్‌ రిసైజర్‌, ఇమేజ్‌ ఆప్టిమైజర్‌, ఐఎంజీఆన్‌లైన్‌, జేపీఈజీ ఆప్టిమైజర్‌ వంటి అనేక టూల్స్‌ అందుబాటులో ఉన్నాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి..

ఉత్తమ ‘పవర్‌’ బ్యాంక్‌లు.. తెలుసుకోండిలా..!

స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ షురూ అయింది..

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts