Published : 08 Sep 2020 23:44 IST

స్పామ్‌ సమస్య: ఐఫోన్ల కోసం ట్రూకాలర్‌ ఫిల్టర్లు

ట్రూ కాలర్‌లో అందుబాటులోకి ఫిల్టర్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల కాలంలో స్పామ్‌ కాల్స్‌ ఎక్కువైపోయాయి. ‘మీరు లాటరీ గెలుచుకున్నారు. దానిని పొందేందుకు కొంత మొత్తం జమచేయండంటూ’, ‘మీ ఏటీఎం కార్డు బ్లాకు అయిపోతుంది. తిరిగి యాక్టివేట్‌ చేయడానికి మీ కార్డు, పిన్‌ నెంబర్లు చెప్పండంటూ’ ఇలా రకరకాలుగా ఫోన్లు వస్తున్నాయి. ఈ విషయం తెలియక కొంతమంది మోసపోతుంటారు. దీనిని గుర్తించడానికి ట్రూకాలర్‌ ఓ ప్రత్యామ్నాయం. ఏదైనా కాల్‌ వచ్చినప్పుడు అవతలి వాళ్లు ఎవరన్నది ట్రూకాలర్‌లో చాలావరకు తెలిసిపోతుంది. ఒక వేళ స్పామ్‌ కాల్‌ అయితే పాప్‌అప్ మెస్సేజ్‌ వస్తుంది. 

ఇది ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో కొంత వరకు బాగానే ఉన్నప్పటికీ, ఐఫోన్స్‌లో మాత్రం స్పామ్‌ కాల్స్‌ని గుర్తించడం కాస్త కష్టంగా మారింది. దీనికి పరిష్కారంగా ట్రూకాలర్‌... ఐఓఎస్‌ వినియోగదారుల కోసం ఫిల్టర్లను అందుబాటులోకి తెచ్చింది. వాటి ద్వారా స్పామ్‌ కాల్స్‌, స్పామ్‌ మెసేజ్‌లను సులువుగా గుర్తించొచ్చట. దీని కోసం యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. స్పామ్‌ మెసేజ్‌లను గుర్తించేందుకు వీలుగా.. ట్రూ కాలర్‌ యాప్‌లో సెట్టింగ్స్‌--> మెసేజ్‌ --> మెసేజ్‌ ఫిల్టరింగ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. స్పామ్‌ కాల్స్‌ గుర్తుపట్టడానికి ‘‘సెట్టింగ్స్‌--> ఫోన్‌‌--> కాల్‌ బ్లాకింగ్‌ అండ్‌ ఐడెంటిఫికేషన్‌’’లో మార్పులు చేయాలి.

ట్రూకాలర్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం భారత్‌లో స్పామ్‌ కాల్స్‌ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గత ఏడాది ఈ సమస్యను ఎదుర్కొంటున్న దేశాల్లో ప్రపంచంలోనే భారత్‌ది ఐదో స్థానం. ఏటా స్పామ్‌కాల్స్‌ సంఖ్య దేశంలో 15 శాతం పెరుగుతోందని అధ్యయనంలో తేలింది. అయితే తాజాగా అభివృద్ధి చేసిన ఫిల్టర్స్‌ వల్ల  ప్రయోజనముంటుందని సంస్థ భావిస్తోంది.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts