Updated : 27 Jan 2021 17:09 IST

WhatsApp: ఈ వారంలో వచ్చిన అప్‌డేట్స్‌ ఇవే..

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తన యూజర్ల కోసం కొత్తగా అప్‌డేట్స్ ఇస్తూనే ఉంటుంది. భద్రతతోపాటు, వ్యక్తిగత గోప్యతను పాటిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. కొంగొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ వాట్సాప్‌ పనితీరును మెరుగు పరుచుకుంటూ యూజర్ల అభిమానాన్ని చూరగొంటోంది. ఈ క్రమంలో గత వారం రోజుల వ్యవధిలో వాట్సాప్‌ తీసుకొచ్చిన ఫీచర్లు, అప్‌డేట్స్‌ను ఓ సారి పరిశీలిద్దాం..  

స్టోరేజీ మేనేజ్‌మెంట్‌ టూల్

వాట్సాప్‌లో బోలెడన్ని ఫొటోలు, వీడియోలు షేర్‌ అవుతుంటాయి. వాటన్నింటిని స్టోర్‌ చేసే సామర్థ్యం అందరి ఫోన్లలో ఉండదు. అనవసరమైన వాటిని ఉంచుకునే బదులు డిలీట్‌ చేసుకుంటే స్టోరేజీ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఒకేసారి ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను ఓపెన్ చేసుకుని డిలీట్‌ చేసుకునే ఆప్షన్‌ను అప్‌డేట్‌ వెర్షన్‌లో వాట్సాప్‌ కల్పించింది. అంతేకాకుండా ఎక్కువ సార్లు ఫార్వార్డ్‌ చేసిన, 5 ఎంబీ కంటే ఎక్కువ ఉన్న వీడియోలు, ఫొటోలు, ఫైల్స్‌ను చూపిస్తుంది. వీటిలో అవసరం లేని వాటిని ఒకేసారి కానీ, విడిగానైనా డిలీట్ చేసుకోవచ్చు. ఏ విభాగానికి ఎంత మేర డేటా వినియోగం అవుతుందో కూడా తెలుసుకునే వీలు ఉంది. 

డిస్‌అపియరింగ్ మెసేజెస్ ఫీచర్‌

వాట్సాప్‌లో ఇదొక అద్భుతమైన ఫీచర్‌ అని చెప్పొచ్చు. తాము పంపే మెసేజ్‌లను వారం తర్వాత వాటికవే  డిలీట్ అయిపోయేలా ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది. దీని కోసం ఎలాంటి టైమర్‌ను సెట్‌ చేసుకోవాల్సిన అవసరంలేదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఏదైనా ముఖ్యమైన మెసేజ్‌ను వారంలోపు స్క్రీన్‌ షాట్‌ కానీ, సేవ్ కానీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఆటోమేటిక్‌గా డిలీట్‌ అయిపోతుంది. ఈ కొత్త ఫీచర్‌తో వ్యక్తిగత చాట్‌లతో పాటు గ్రూప్‌ చాట్‌లను డిలీట్ చెయ్యొచ్చు. అయితే గ్రూప్‌ చాట్‌లో ఈ ఫీచర్‌ ఉపయోగించే అవకాశం కేవలం గ్రూప్ అడ్మిన్‌లకు మాత్రమే ఉంటుందని వాట్సాప్‌ పేర్కొంది. అంతే కాకుండా ఒక వేళ బ్యాకప్‌ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే డిస్‌అపియరింగ్‌ అయిన మెసేజ్‌లు స్టోర్‌ అయ్యే వెసులుబాటు కల్పించింది. డిస్‌అపియరింగ్‌ మెసేజ్‌లను కొత్త వారికి ఫార్వార్డ్‌ చేస్తే వాటిని తీసేయడం కుదరదు. 

పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సమస్య ఉంటే రిపోర్ట్‌ చేయొచ్చు..ఆధారాలు చూపాలి

వాట్సాప్‌ యాప్‌కు తెలియని, తెలిసిన ఖాతాల నుంచి వేధింపులకు గురి చేస్తూ మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు వస్తుంటాయి. వాటిని డిలీట్‌ చేయడమో లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయడమో చేస్తుంటాం. అలాగే వాట్సాప్‌ బిజినెస్‌ అకౌంట్ల నుంచి వచ్చే మెసేజ్‌లు స్పామ్‌ అనిపిస్తే వెంటనే వాట్సాప్‌కు రిపోర్ట్‌ చేసే అవకాశం ఉంది. అయితే మీరు ఇచ్చిన రిపోర్ట్‌కు ఆధారాలను జత చేయాల్సి ఉంటుంది. అంటే ఏ వాట్సాప్ అకౌంట్‌పై మీరు ఫిర్యాదు చేశారో ఆ యూజర్‌తో జరిగిన చాటింగ్‌ను సాక్ష్యంగా వాట్సాప్‌కు చూపించాలి. అప్పుడే దానిపై సరైన రీతిలో వాట్సాప్‌ చర్యలు తీసుకుంటుంది. 

పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వాట్సాప్‌ పేమెంట్స్‌ 

ఇప్పుడంతా ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ను చేయడానికే వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. కేంద్రం కూడా డిజిటల్‌ చెల్లింపులకు ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా యూపీఐ సేవలకు అనుమతినిచ్చింది. చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు యూపీఐ సౌకర్యం కల్పించాయి. అలాగే గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం, ఎయిర్‌టెల్‌, జియో వంటి సంస్థలు ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ రంగంలో దూసుకుపోతున్నాయి.  ఈ క్రమంలో వాట్సాప్‌ కూడా డిజిటల్‌ చెల్లింపుల విభాగంలోకి అడుగుపెట్టింది. ఆర్థిక లావాదేవీలను నిర్వహించేందుకు వాట్సాప్‌కు ఎన్‌పీసీఐ అనుమతిని మంజూరు చేసింది. దేశంలోని 140 బ్యాంకు ఖాతాల ద్వారా పేమెంట్స్‌ చేసుకోవచ్చు. అలానే పది ప్రాంతీయ భాషల్లో వాట్సాప్‌ పేమెంట్స్‌ సేవలు అందుబాటులో ఉంటాయి.బ

పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని