ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం Mi కొత్త ల్యాప్‌టాప్‌

కొవిడ్‌-19 పరిస్థితుల దృష్ట్యా కార్యాలయాలు, పాఠశాలలు మూడపడ్డాయి. ఎక్కువ శాతం మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నారు. అలానే విద్యార్ధుల విద్యాసంవత్సరం కోల్పోకుండా పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి...

Updated : 12 Aug 2022 12:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కొవిడ్‌-19 పరిస్థితుల దృష్ట్యా కార్యాలయాలు, పాఠశాలలు మూడపడ్డాయి. ఎక్కువ శాతం మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నారు. అలానే విద్యార్ధుల విద్యా సంవత్సరం కోల్పోకుండా పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. దీని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రానిక్‌  కంపెనీలు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్‌తో ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లను తీసుకొస్తున్నాయి. తాజాగా షావోమి వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసే ఉద్యోగులు, ఆన్‌లైన్‌ క్లాసులు వినే విద్యార్ధుల కోసం ఎంఐ నోట్‌బుక్‌ 14 ఈ-లెర్నింగ్ ఎడిషన్‌ పేరుతో కొత్త మోడల్ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇటీవల వచ్చిన ఎంఐ నోట్‌బుక్‌ 14కు కొనసాగింపుగా కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చారు. పూర్తి మెటాలిక్‌ బాడీ ఫ్రేంతో విద్యార్ధుల కోసం లైట్‌ వెయిట్, స్లీక్‌ డిజైన్‌తో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్స్‌ ఉన్నాయో తెలుసుకుందాం.

ఎంఐ నోట్‌బుక్‌ 14 ఈ-లెర్నింగ్‌ ల్యాప్‌టాప్‌ విండోస్ 10 ఓఎస్‌తో పనిచేస్తుంది. 14 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్‌ ఎల్‌సీడీ యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇంటెల్ కోర్‌ ఐ3-10110యు ప్రాసెసర్‌, ఇంటెల్ యుహెచ్‌డీ గ్రాఫిక్స్‌ 620 గ్రాఫిక్‌ కార్డ్‌ ఉపయోగించారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ ఇస్తున్నారు. 3220 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 65 వాట్‌ ఛార్జర్‌ ఇస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే పది గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. కేవలం 35 నిమిషాల ఛార్జింగ్‌తో 50 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది. వీటితో పాటు హెచ్‌డీ వెబ్‌కామ్‌, డీటీఎస్‌-ట్యూన్డ్‌ స్టీరియో లౌడ్ ‌స్పీకర్స్‌ ఉన్నాయి. ఎంఐ బ్యాండ్ సహాయంతో ల్యాప్‌టాప్‌ను అన్‌లాక్‌ చేసుకునే ఫీచర్ కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ ధర భారత మార్కెట్లో రూ.34,999. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని