Mony Mist: అతి చిన్న 4జీ స్మార్ట్‌ఫోన్!  

స్మార్ట్‌ఫోన్‌ అంటే 6-అంగుళాల డిస్‌స్లేతో పెద్దగా ఉంటుందని మాత్రమే మనకు తెలుసు. కానీ, కంప్యూటర్ మౌస్‌ కంటే తక్కువ సైజ్‌లో ఉంటే దాన్ని స్మార్ట్‌ఫోన్‌ అంటారా అంటే..కాదు అనే సమాధానం వినిపిస్తుంది. సాంప్రదాయ స్మార్ట్‌ఫోన్‌లకు భిన్నంగా చేతిలో ఇమిడిపోయే పరిమాణంలో మోనీ కంపెనీ ‘మిస్ట్‌’ అనే స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తుంది...

Updated : 05 Jul 2021 16:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ అంటే ఐదారు అంగుళాల డిస్‌స్లేతో పెద్దగా ఉంటుందని మాత్రమే మనకు తెలుసు. కానీ, కంప్యూటర్ మౌస్‌ కంటే తక్కువ సైజ్‌లో ఉంటే దాన్ని స్మార్ట్‌ఫోన్‌ అంటారా? అంటే..కాదు అనే సమాధానం వినిపిస్తోంది. సంప్రదాయ స్మార్ట్‌ఫోన్‌లకు భిన్నంగా చేతిలో ఇమిడిపోయే పరిమాణంలో మోనీ కంపెనీ ‘మిస్ట్‌’ అనే స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. ఐఫోన్ 4 స్ఫూర్తితో మిస్ట్‌ను తయారు చేసినట్లు మోనీ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం తయారీ దశలో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ముందస్తుగా ఈ ఫోన్ కావాలనుకునే వారికి క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా 99 డాలర్లకే (సుమారు రూ.7,300) అందివ్వనున్నారు. దీని మార్కెట్‌ ధర మాత్రం 150 డాలర్లుగా (సుమారు రూ. 11 వేలు) కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో లభించే ఖరీదైన, పెద్ద సైజ్‌ మోడల్స్‌కి ప్రత్యామ్నాయంగా, చిన్న సైజ్‌ ఫోన్లు ఉపయోగించాలనుకునే వారి కోసం ఈ ఫోన్‌ను రూపొందిస్తున్నట్లు మోనీ కంపెనీ తెలిపింది. 

మోనీ మిస్ట్ ఫీచర్స్‌

ఈ ఫోన్‌ 4-అంగుళాల సైజులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 9 ఓస్‌తో పనిచేస్తుంది. మీడియాటెక్ క్వాడ్‌కోర్‌ మాలీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. 3-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో రెండు కెమెరాలున్నాయి. వెనకవైపు 13 ఎంపీ ప్రధాన కెమెరా అమర్చారు. ముందుభాగంలో సెల్ఫీల కోసం వీజీఏ కెమెరా ఇస్తున్నారు. మిస్ట్‌లో 1250ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 72 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తుందని మోనీ కంపెనీ తెలిపింది. ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ-సీ పోర్ట్ ఇస్తున్నారు. వైఫై, బ్లూటూత్ ఫీచర్లు ఉన్నాయి. 3జీబీ ర్యామ్‌/32జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్‌లో బ్లాక్‌ కలర్‌లో మాత్రమే మిస్ట్‌ లభిస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని