eSIM: ఈ-సిమ్ అంటే ఏమిటి? దాన్ని ఎలా పొందాలి?
యాపిల్ కంపెనీ త్వరలో విడుదల చేయనున్న ఐఫోన్ 14లో సాధారణ సిమ్ కార్డ్ అవసరంలేకుండా ఈ -సిమ్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు తెలిపింది. దీంతో మరోసారి ఈ-సిమ్‌పై నెటిజన్లలో చర్చ మొదలైంది.
ఇంటర్నెట్‌డెస్క్: స్విమ్ స్వాప్ ద్వారా జరిగే సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు మొబైల్ తయారీ కంపెనీలు ఎలక్ట్రానిక్ సిమ్ (ఈ-సిమ్- eSIM) సాంకేతికతపై దృష్టి సారించాయి. యాపిల్ కంపెనీ త్వరలో విడుదల చేయనున్న ఐఫోన్ 14లో సాధారణ సిమ్ కార్డ్ లేకుండా పూర్తిగా ఈ-సిమ్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ-సిమ్ గురించి నెటిజన్లలో చర్చ మొదలైంది. అసలు ఈ-సిమ్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం.
ఈ-సిమ్ అంటే?
సాధారణ మొబైల్ సిమ్‌కు డిజిటల్ వెర్షనే ఈ-సిమ్. దీన్ని భౌతికంగా మొబైల్‌లోని సిమ్ స్లాట్‌లో ఉంచాల్సిన అవసరంలేదు. ఈ సాంకేతికత మీరు ఎంచుకున్న నెట్‌వర్క్‌కు మీ మొబైల్‌ను డిజిటల్‌గా అనుసంధానిస్తుంది. ఇందుకోసం యూజర్స్ రీఛార్జ్ చేసుకున్నట్లు మొబైల్ నెట్‌వర్క్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. ముందుగా మీరు నెట్‌వర్క్ ఆప్‌రేటర్‌కు సంబంధించిన అవుట్‌లెట్‌కు వెళ్లి మీ గుర్తింపు పత్రాలని సమర్పించాలి. తర్వాత నెట్‌వర్క్ ఆపరేటర్ నుంచి మీ ఫోన్‌కు కోడ్ వస్తుంది. ఆ కోడ్‌తో మీ మొబైల్‌లో ఈ-సిమ్ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. దాంతో మీరు సబ్‌స్క్రైబ్ చేసుకున్న నెట్‌వర్క్ కంపెనీ సేవలను పొందొచ్చు. కొన్ని నెట్‌వర్క్ ఆపరేటింగ్ కంపెనీలు యూజర్ అవుట్‌లెట్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈ-సిమ్‌ను కేటాయిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీ ఈ-సిమ్ సేవలను అందిస్తున్నాయి.
ఫోన్లతోపాటు వీటిలోనూ..
ఇప్పటికే యాపిల్ కంపెనీ ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్‌తోపాటు, ఆ తర్వాత విడుదలైన అన్ని ఐఫోన్ మోడల్స్‌లో సాధారణ సిమ్ స్లాట్‌తోపాటు ఈ-సిమ్ సదుపాయం కూడా అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్, గూగుల్ పిక్సెల్ మోడల్స్‌లో కూడా ఈ-సిమ్ ఫీచర్ ఉంది. స్మార్ట్‌ఫోన్లతో పాటు ఎల్‌టీఈ వెర్షన్ యాపిల్ స్మార్ట్‌వాచ్‌లు, శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌లలో కూడా ఈ-సిమ్ ఫీచర్ ఇస్తున్నారు. యాపిల్ వాచ్ 7 సిరీస్‌లో వాచ్ యాప్ ద్వారా ఐఫోన్ నుంచి ఈ-సిమ్ ప్రొఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ-సిమ్‌తో లాభ-నష్టాలు
ఈ-సిమ్ వల్ల స్విమ్ స్వాప్ ద్వారా జరిగే సైబర్ నేరాలు తగ్గుతాయి. అలానే మొబైల్ తయారీలో సిమ్ స్లాట్‌కు ఉపయోగించే స్థానాన్ని బ్యాటరీ, ప్రాసెసర్ వంటి ఇతర కాంపోనెంట్‌ల కోసం కేటాయించవచ్చు. దీనివల్ల యూజర్స్‌కు ఎక్కువ ఫీచర్స్‌తో కూడిన ఫోన్లు అందుబాటులోకి వస్తాయి. అదే సమయంలో ఈ-సిమ్ వల్ల కొన్ని ఇబ్బందులూ ఉన్నాయి. ఈ-సిమ్ యూజర్స్ పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కు మారే ప్రతిసారీ కొత్త సిమ్ ప్రొఫైల్ కోసం నెట్‌వర్క్ ఆపరేటింగ్ కంపెనీల అవుట్‌లెట్‌కు వెళ్లాల్సిందే. అలానే ఓటీపీ సాయంతో యూజర్‌ను ఏమార్చి నకిలీ ఈ-సిమ్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసే ప్రమాదమూ లేకపోలేదు. యూజర్ అవతలి వారికి ఓటీపీ చెప్పనంతవరకు మీ ఈ-సిమ్ సురక్షితం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్
-
Crime News
Nellore: భర్త అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటలకే భార్య మృతి
-
Viral-videos News
Viral Video: ఇదేం వెర్రో..? రన్నింగ్కారుపై పుష్ అప్స్ తీస్తూ హల్చల్!
-
Politics News
Andhra News: జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తాం: సీపీఐ రామకృష్ణ
-
Movies News
Srikanth Odhela: వైభవంగా ‘దసరా’ దర్శకుడి వివాహం.. నాని పోస్ట్‌తో శుభాకాంక్షల వెల్లువ