యూట్యూబ్ మజాగా
స్మార్ట్‌ఫోన్‌లో రోజూ యూట్యూబ్ వీడియోలు చూస్తూనే ఉంటాం. ఈ యాప్‌లో బోలెడన్ని ఫీచర్లున్నాయి.
స్మార్ట్‌ఫోన్‌లో రోజూ యూట్యూబ్ వీడియోలు చూస్తూనే ఉంటాం. ఈ యాప్‌లో బోలెడన్ని ఫీచర్లున్నాయి. కాకపోతే ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ తెరల మాదిరిగా కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్క్రీన్ చిన్నగా ఉండటం వల్ల చాలా ఫీచర్లు అదృశ్యంగానే ఉంటాయి. వీటి గురించి తెలుసుకుంటే మరింత తేలికగా యూట్యూబ్‌ను వాడుకోవచ్చు.
వీడియో చాలా పెద్దగా ఉంది. చూస్తున్న దృశ్యం నచ్చలేదు. దాన్ని అక్కడితో వదిలేసి త్వరగా ముందుకు వెళ్లాలని అనిపించొచ్చు. అప్పుడు వీడియో మీద కుడివైపున రెండుసార్లు తడితే చాలు. పది సెకండ్ల ముందుకు కదులుతుంది. అదే ఎడమవైపున రెండు సార్లు తడితే 10 సెకండ్లు వెనక్కు వెళ్తుంది. అలా తడుతూనే ఉంటే ఇంకాస్త ముందుకు, వెనక్కు పోతూనే ఉంటుంది. కావాలంటే ముందుకు, వెనక్కు కదిలే సమయాన్నీ మార్చుకోవచ్చు. ప్రొఫైల్ ఫొటో మీద తాకి, సెటింగ్స్‌లోకి వెళ్లాలి. జనరల్ విభాగంలో డబుల్ ట్యాప్ టు సీక్‌ను తాకాలి. దీనిలోంచి సమయాన్ని ఎంచుకోవాలి.
* వీడియోలో ఏదైనా దృశ్యాన్ని పెద్దగా చూసే అవకాశమూ ఉంది. వీడియో ప్లే అవుతున్నప్పుడు రెండు వేళ్లతో తెర మీద తాకి వెడల్పుగా చేస్తే దృశ్యం పెద్దగా కనిపిస్తుంది.
* మనం వీలైనంత ఎక్కువసేపు చూసేలా యూట్యూబ్ ట్రిక్కులు చేస్తుంది. వీడియో రికమెండేషన్లతో పాటు తర్వాతి వీడియో దానంతటదే ప్లే అయ్యేలా చేయటం వీటిల్లో ఒకటి. దీంతో ఆగకుండా వీడియోలు ప్లే అవుతూనే ఉంటాయి. అదృష్టం కొద్దీ దీన్ని తేలికగానే డిసేబుల్ చేసుకోవచ్చు. వీడియో ప్లే అవుతున్నప్పుడు దాని మీద తాకితే కంట్రోళ్లు, ఇతర సెటింగ్స్ కనిపిస్తాయి. వీటిల్లో పైన నిలువు రెండు గీతల గుర్తు మీద తాకి ఆటో ప్లే ఆప్షన్‌ను డిసేబుల్, ఎనేబుల్ చేసుకోవచ్చు.
* నచ్చిన, అవసరమైన వీడియోలను వెతకటానికి సెర్చ్ ఆప్షన్ మంచి సదుపాయం. అయితే కొన్నిసార్లు ఇది ఇబ్బంది కలిగించొచ్చు. ముఖ్యంగా ఇతరులు మన ఫోన్‌లో యూట్యూబ్‌ను చూస్తున్నప్పుడు అంతకుముందు ఏమేం చూశామో వారికి తెలిసిపోతుంది. ఇలాంటి ఇబ్బంది వద్దనుకుంటే యూట్యూబ్ సెర్చ్ హిస్టరీని పాజ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ప్రొఫైల్ ఫొటో మీద తాకి, యువర్ డేటా ఇన్ యూట్యూబ్‌ను ట్యాప్ చేయాలి. ఆ పేజీలో కాస్త కిందికి వెళ్తే యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ విభాగం కనిపిస్తుంది. ఆన్ గుర్తు పక్కన నొక్కి.. ఇంక్లూడ్ యువర్ సెర్చెస్ ఆన్ యూట్యూబ్ బాక్స్‌ను అన్‌చెక్ చేయాలి. దీంతో సెర్చ్ హిస్టరీ పాజ్ అవుతుంది.
* ఇష్టమైన కొత్త వీడియోలను కనుక్కోవటానికి యూట్యూబ్ రికమండేషన్స్ ఆల్గోరిథమ్ బాగా సహకరిస్తుంది. వీడియో పూర్తయ్యాక కొన్ని వీడియోలు కనిపించటం చూసే ఉంటారు. వీటి కోసం వీడియో పూర్తయ్యేంతవరకు ఆగాల్సిన పనేమీ లేదు. ఫుల్ స్క్రీన్ మోడ్‌లో వీడియో ప్లే అవుతున్నప్పుడు పైకి స్వైప్ చేస్తే చాలు. రికమండేషన్లు కనిపిస్తాయి.
* డేటా ఎక్కువగా తీసుకుంటుందని అనిపిస్తే వీడియో క్వాలిటీ తగ్గించుకోవచ్చు, అస్పష్టంగా కనిపిస్తే పెంచుకోవచ్చు. వీడియో ప్లే అవుతున్నప్పుడు దాని మీద తాకితే సెటింగ్స్ గుర్తు కనిపిస్తుంది. దాని మీద తాకగానే క్వాలిటీ ఆప్షన్ కనిపిస్తుంది. దీని ద్వారా ఇష్టమైన క్వాలిటీని ఎంచుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
RTC Cargo: తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Movies News
Anasuya: ప్రెస్మీట్లో కన్నీరు పెట్టుకున్న అనసూయ
-
World News
నీటి లోపల వంద రోజులు జీవిస్తే.. ప్రొఫెసర్ ఆసక్తికర ప్రయోగం!
-
Crime News
Vijayawada: విజయవాడలో డ్రగ్స్ స్వాధీనం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Rains: మూడు రోజులు తేలికపాటి వర్షాలు