Amazon: అమెజాన్‌ కొత్త ఫీచర్‌.. ఇకపై ‘వర్చువల్ ట్రైల్’ షురూ!

వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించడం కోసం అమెజాన్‌ ఈ-కామర్స్‌ సంస్థ మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. దీంతో యూజర్లు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేప్పుడు తమకు నచ్చిన షూ, చెప్పులను వర్చువల్‌గా ట్రైల్‌ చేయొచ్చు... 

Published : 11 Jun 2022 02:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించడం కోసం అమెజాన్‌ ఈ-కామర్స్‌ సంస్థ మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. దీంతో యూజర్లు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేప్పుడు తమకు నచ్చిన షూ, చెప్పులను వర్చువల్‌గా ట్రైల్‌ చేయొచ్చు. అంటే దుకాణానికి వెళ్లినప్పుడు మనకు నచ్చిన మోడల్‌ షూను ధరించి, నడిచేందుకు అనుకూలంగా ఉందా? లేదా? అని కొంత దూరం నడిచి చూస్తాం. అదే తరహాలో అమెజాన్‌ తీసుకొస్తున్న వర్చువల్‌ ట్రై-ఆన్‌ (Virtual Try-On) ఫీచర్‌తో యూజర్లు తమకు నచ్చిన షూ మోడల్‌ను కాళ్లకు ధరించిన అనుభూతిని పొందుతూ, అన్ని వైపుల నుంచి సరిచూసుకోవడమే కాకుండా, పాదాలకు అవి నప్పుతాయా? లేదా? అని కాలు కదిపి చెక్ చేసుకోవచ్చట. అంతేకాకుండా వర్చువల్‌గా ధరించిన షూ ఫొటోలను సోషల్‌ మీడియాతోపాటు స్నేహితులకు షేర్‌ చేయొచ్చు. 

ఈ ఫీచర్‌ను ప్రయత్నించాలనుకునే యూజర్లు అమెజాన్‌ యాప్‌లో తమకు నచ్చిన షూ మోడల్‌ కింది భాగంలో ఉన్న అమెజాన్‌ వర్చువల్‌ ట్రై-ఆన్‌ ఫీచర్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ప్రొడక్ట్ ఇమేజ్‌ (Product Image) అని ఉన్నచోట క్లిక్ చేసి ఫోన్‌ కెమెరాను పాదం దగ్గరగా ఉంచితే షూ ఇమేజ్‌ వర్చువల్‌గా పాదంపై పడుతుంది. దాంతో షూ తమ కాలికి ఎలా ఉందనే చూడొచ్చు. అలానే యూజర్స్‌ షూ కలర్‌ను కూడా మార్చుకొని చెక్‌ చేసుకోవచ్చు. దీనివల్ల యూజర్లు షాపింగ్‌లో సరికొత్త అనుభూతిని పొందుతారని అమెజాన్ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అమెరికా, కెనడాలోని ఐఓఎస్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అన్ని ప్రాంతాల వారికి పరిచయం చేయనున్నట్లు సమాచారం. అలానే అమెజాన్‌ భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులకు ఈ వర్చువల్‌ ట్రై-ఆన్‌ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని