Amazon Fire Tv Stick: అలెక్సా సపోర్ట్‌తో అమెజాన్‌ కొత్త టీవీ స్టిక్‌ లైట్‌

అమెజాన్‌ సంస్థ కొత్త మోడల్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌ లైట్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ డివైజ్‌తోపాటు అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్ సపోర్ట్‌తో రిమోట్‌ ఇస్తున్నారు.

Published : 13 Jun 2022 20:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెజాన్‌ సంస్థ కొత్త మోడల్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌ లైట్‌ (Amazon Fire TV Stick Lite) పేరుతో తీసుకొస్తున్న ఈ డివైజ్‌తోపాటు అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్ సపోర్ట్‌తో రిమోట్‌ ఇస్తున్నారు. సాంకేతికత పరంగా 2020లో విడుదలైన ఫైర్‌ టీవీ స్టిక్‌కు ఇది దగ్గరగా ఉంటుంది. ఇప్పటికే అమెజాన్ కంపెనీ 4k రిజల్యూషన్‌తో రెండు, హెచ్‌డీ స్ట్రీమింగ్‌తో మూడు టీవీ స్టిక్‌లను తీసుకొచ్చింది. తాజాగా తీసుకొచ్చిన ఫైర్‌ టీవీ స్టిక్‌ లైట్‌ ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం. 

అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌ లైట్‌తో పాటు ఇస్తున్న రిమోట్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ మ్యూజిక్‌ వంటివి సులువుగా యాక్సెస్‌ చేసుకునేందుకు ప్రత్యేకమైన బటన్స్ ఉన్నాయి. వాయిస్‌ బటన్‌తో అలెక్సాను యాక్సెస్‌ చేయొచ్చు. కొత్తగా ఇందులో యాప్స్‌ కంట్రోల్ ఫీచర్‌ కూడా ఉంది. ఇంకా యూట్యూబ్‌, యూట్యూబ్‌ కిడ్స్‌, ఎమ్‌ఎక్స్‌ప్లేయర్‌, టీవీఎఫ్‌ప్లే, యప్‌ టీవీ వంటివి ఉచితంగా పొందొచ్చు. అలానే ఈ ఫైర్‌ స్టిక్‌లో 8 జీబీ స్టోరేజ్‌, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. ఇది ఫుల్‌-హెచ్‌డీ కంటెంట్‌ స్ట్రీమింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 2,999. ప్రారంభ ఆఫర్ కింద రూ. 2,499కే కొనుగోలు చేయొచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని