Amazon: అలెక్సా.కామ్‌ ఇక కనుమరుగు.. మూసివేతకు అమెజాన్‌ నిర్ణయం

అమెరికాకు చెందిన ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) సంచలన నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్లుగా నిర్వహిస్తున్న అలెక్సా.కామ్‌ (Alexa com) వెబ్‌సైట్‌ను మూసివేయాలని నిర్ణయించింది.

Published : 09 Dec 2021 20:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాకు చెందిన ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) సంచలన నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్లుగా నిర్వహిస్తున్న అలెక్సా.కామ్‌ (Alexa com) వెబ్‌సైట్‌ను మూసివేయాలని నిర్ణయించింది. వెబ్‌సైట్‌ ర్యాంకులతో పాటు ఎస్‌ఈవో అనలటిక్స్‌ వివరాలను ఈ సైట్‌ ద్వారా అందిస్తూ వచ్చింది. 2022 మే నెలతో ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు అమెజాన్‌ పేర్కొంది. అలెక్సా ఏపీఐ సేవలను సైతం 2022 డిసెంబర్‌ నాటికి మూసివేస్తామని అమెజాన్‌ స్పష్టంచేసింది.

2022 మే 1 నుంచి ఈ సేవలు నిలిచిపోతాయయని అమెజాన్‌ అలెక్సా వెబ్‌సైట్‌, సపోర్ట్‌ పేజీలో పేర్కొంది. సేవలు నిలిచిపోయేలోపు ఆయా వెబ్‌సైట్ల డేటాను పొందేందుకు వినియోగదారులకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. అలెక్సా మూసివేతకు గల కారణాలను మాత్రం అమెజాన్‌ వెల్లడించలేదు. 1996 ఏప్రిల్‌లో అలెక్సా ఇంటర్నెట్‌ను అమెజాన్‌ ప్రారంభించింది. ఒక వెబ్‌సైట్‌ దేశీయంగా, ప్రపంచవ్యాప్త ఏ ర్యాంకులో ఉందో అలెక్సా.కామ్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని