Ambrane Wise Eon Pro: బడ్జెట్‌ ధరలో 10 రోజుల బ్యాటరీ లైఫ్‌తో స్మార్ట్‌వాచ్‌

అంబ్రేన్‌ కంపెనీ లో బడ్జెట్‌ ధరలో కొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మరి, ఈ వాచ్‌ ధర ఎంత? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం. 

Published : 15 Oct 2022 15:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంబ్రేన్‌ కంపెనీ ఇయాన్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బడ్జెట్‌ ధరలో ఎక్కువ రోజుల బ్యాటరీ లైఫ్‌ దీని ప్రత్యేకత. అంబ్రేన్‌ వైజ్‌ ఇయాన్‌ ప్రో (Ambrane Wise Eon Pro) పేరుతో వస్తోన్న ఈ వాచ్‌ ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం. 

ఇందులో 1.85 అంగుళాల లూసిడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీనికి 2.5డీ గ్లాస్‌ ప్రొటెక్షన్ ఉంది. వందకుపైగా వాచ్‌ ఫేస్‌లు, స్పోర్ట్స్‌ మోడ్స్‌ ఉన్నాయి.  బ్లడ్‌ ఆక్సిజన్, స్లీప్‌ మానిటర్‌, హార్ట్‌రేట్‌ అలర్ట్‌, బ్రీత్‌ ట్రెయినింగ్‌ ఫీచర్లతోపాటు తగినంత నీరు తాగేలా యూజర్‌కు రిమైండర్‌ అలర్ట్‌ ఇస్తుంది. మహిళల కోసం రుతుక్రమాన్ని ట్రాక్‌ చేసే ఫీచర్‌ కూడా ఉంది. ఐపీ68 వాటర్ రెసిస్టెంట్ ఇస్తున్నారు. 280 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 10 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. బ్లూటూత్ కనెక్టివిటీతో వాయిస్‌ అసిస్టెంట్, మ్యూజిక్ ప్లేబ్యాక్‌, కెమెరాలను కంట్రోల్‌ చేయొచ్చు. ఈ వాచ్‌ ధర ₹ 1,799. అంబ్రేన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని