6 రోజుల్లో.. రూ.84లక్షలు!

యాపిల్‌ ఎట్టకేలకు ఐఓస్‌14తో హోంస్ర్కీన్‌ కస్టమైజ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో కస్టమ్‌ ఐకాన్‌ ప్యాక్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకొని ఫోన్‌ రూపురేఖలు మార్చుకోవచ్చు. ఇప్పటికే ఐఫోన్‌ వినియోగదారులు హోం స్ర్కీన్‌ను రకరకాలుగా మార్చి స్ర్కీన్‌షాట్‌లను సోషల్‌మీడియాలో పెడుతున్నారు.

Updated : 10 Oct 2020 21:04 IST

ఐకాన్‌ సెట్‌తో భారీగా సంపాదించిన డిజైనర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ ఎట్టకేలకు ఐఓస్‌ 14తో హోంస్ర్కీన్‌ కస్టమైజ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో కస్టమ్‌ ఐకాన్‌ ప్యాక్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకొని ఫోన్‌ రూపురేఖలు మార్చుకోవచ్చు. ఇప్పటికే ఐఫోన్‌ వినియోగదారులు హోం స్ర్కీన్‌ను రకరకాలుగా మార్చి స్ర్కీన్‌షాట్‌లను సోషల్‌మీడియాలో పెడుతున్నారు. ఈ ట్రెండ్‌ కస్టమ్‌ యాప్‌ ఐకాన్స్‌ తయారు చేసే ఓ డిజైనర్‌కు కాసులు కురిపించింది. ఆయన ఆరు రోజుల్లో 1,15,000 డాలర్లు(సుమారు రూ.84లక్షలు) సంపాదించాడు. 
శాన్‌ఫ్రాన్సిస్‌కోకు చెందిన ట్రాఫ్‌ అనే డిజైనర్‌ కస్టమ్‌ యాప్‌ ఐకాన్‌ ప్యాక్స్‌ తయారు చేస్తుంటాడు. పలువురు వినియోగదారులు ఐఓస్‌14తో హోం స్ర్కీన్‌లను నూతనంగా మార్చి స్క్రీన్‌షాట్లను సామాజిక మాధ్యమాల్లో పెడుతుండటంతో ఆయనకు ఓ ఆలోచన వచ్చింది. దీంతో ట్రాఫ్‌ కొన్ని యాప్‌ ఐకాన్లు, విడ్జెట్లు తయారు చేసి హోంస్ర్కీన్‌ను తన బ్లాగ్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ఈ పోస్టును చూసిన నెటిజన్లు ఆయన ఐకాన్ ప్యాక్‌ను తెగ ఇష్టపడ్డారు. వాటిని తమకు షేర్‌ చేయాలని అడగడం మొదలుపెట్టారు. దీంతో డిమాండ్‌ను గుర్తించిన ట్రాఫ్‌ వాటిని కొన్ని ఆన్‌లైన్‌ విక్రయ సైట్లలో అందుబాటులో ఉంచారు. 120 ఐకాన్స్‌తో కూడిన ప్యాక్‌ను 28డాలర్లకు అమ్మడం మొదలుపెట్టాడు. రెండు రోజుల్లోనే విపరీతమైన లైక్‌లతో పాటు 6,000 డాలర్లు సంపాదించాడు. ఆ తరువాత రోజు 40వేల డాలర్లు వచ్చాయి. ప్రఖ్యాత టెక్‌ యూట్యూబర్‌ మార్కస్‌ బ్రౌన్‌లీ తన యూట్యూబ్‌ వీడియోలో ఈ ఐకాన్‌ప్యాక్‌ గురించి చెప్పడం ట్రాఫ్‌కి కలిసొచ్చింది. 

మెత్తానికి సుమారు 4,188 మంది వినియోగదారులకు తన ఐకాన్‌ప్యాక్‌ను విక్రయించినట్లు ట్రాఫ్‌ తన బ్లాగ్‌లో రాశారు. సరైన విషయాన్ని సరైన సమయంలో పోస్టుచేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని ఆయన తెలిపారు. ఇది ఒక్కరోజులో వచ్చిన విజయం కాదని 2013లోనే ఒక ఐకాన్‌ సెట్‌ తయారు చేసి 17డాలర్లు సంపాదించినట్లు చెప్పారు. ఇంటర్నెట్‌ ద్వారా మొదటిసారి 17 డాలర్లు సంపాదించడం ఆనందాన్నిచ్చిందని వివరించారు. సరైన విధంగా కంటెంట్‌ ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిసి ఇలా చేసినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని