యాప్‌ పెయిర్స్‌: ఆండ్రాయిడ్ కొత్త ఫీచర్‌..

గూగుల్ త్వరలో విడుదలకానున్న ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌లో యాప్‌ పెయిర్స్‌ పేరుతో కొత్త ఫీచర్‌ని పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో ఫోన్‌లో ఒకే సారి రెండు యాప్‌లని ఓపెన్‌ చెయ్యొచ్చు. అంతేకాదు రెండు యాప్‌లను పెయిర్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంటుందట.... 

Published : 22 Jan 2021 22:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ అంటే వీడియోలు చూసేందుకు పెద్ద డిస్‌ప్లే, ఫొటోలకు మంచి కెమెరాలు, నిరంతరాయంగా పనిచేసేందుకు అధిక సామర్థ్యమున్న బ్యాటరీ ఇలా ఎన్నో రకాల ఫీచర్స్‌తో చేతిలో ఇమిడిపోయే ఏకైక సాధనం. అరచేతిలో ఫోన్‌ ఉండాలే కానీ ప్రపంచాన్ని చుట్టి రావచ్చనేది నేటి తరం మాట. అంతలా మనిషి జీవితంతో పెనవేసుపోయిన స్మార్ట్‌ఫోన్‌లో మరో కొత్త ఫీచర్‌ని తీసుకొస్తుంది గూగుల్. త్వరలో విడుదలకానున్న ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌లో దీన్ని పరిచయం చేయనుంది. ‘యాప్‌ పెయిర్స్‌’ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో ఫోన్‌లో ఒకే సారి రెండు యాప్‌లని ఓపెన్‌ చెయ్యొచ్చు. అంతేకాదు రెండు యాప్‌లను పెయిర్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంటుందట.

గతంలో ఆండ్రాయిడ్‌ ఫోన్లలో స్ల్పిట్‌ స్క్రీన్‌ పేరుతో ఇదే తరహా ఫీచర్‌ ఉండేది. అయితే ఇది యూజర్‌ ఫ్రెండ్లీ కాకపోవడంతో పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. దీంతో మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ డ్యూయో, శాంసంగ్ మల్టీ విండో పేరుతో స్ల్పిట్ స్క్రీన్‌ ఫీచర్‌‌ని పరిచయం చేశాయి. తాజాగా గూగుల్‌ కూడా స్ల్పిట్ స్క్రీన్‌కి బదులు యాప్‌ పెయిర్స్‌ని తీసుకొస్తుంది. అలానే ఈ ఫీచర్‌ యూజర్స్ సులువుగా యాక్సెస్‌ చేసుకునే ఫోన్‌ పై భాగంలో పిన్‌ చేయనుంది. ఈ యాప్‌ పెయిర్స్‌తో యాప్‌కి యాప్‌కి మధ్య డివైడర్ ఉంటుంది. దీంతో ఒకేసారి రెండు యాప్‌లు ఓపెన్ చేసినప్పడు రెండింటి మధ్య దూరాన్ని యూజర్‌ తగ్గించుకోవచ్చు. అలానే యాప్స్‌ని పై నుంచి కిందికి మార్చుకోవచ్చు. డివైడర్‌పై రెండు సార్లు టాప్‌ చేస్తే ఈ ఫీచర్‌ యూజర్‌కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఏడాది ప్రథమార్థంలోనే యాప్‌ పెయిర్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి..

స్టూడెంట్స్‌ స్పెషల్‌... కొత్త ర్యాంక్స్‌

వాట్సాప్‌లో ఈ సందేశాలు వచ్చాయా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని