
Malware Apps: హువావే డివైజ్‌లు వాడుతున్నారా.. ఈ మాల్వేర్తో జాగ్రత్త సుమా..!
ఇంటర్నెట్‌డెస్క్: ఆన్లైన్ డేటా భద్రతకు సంబంధించి యూజర్స్‌కు సైబర్ సెక్యూరిటీ సంస్థలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. హ్యాకర్స్ కొత్త మార్గాల ద్వారా యూజర్ డేటాపై దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా హువావే యాప్ గ్యాలరీలోని యాప్‌లలో ఆండ్రాయిడ్ ట్రాజన్స్ మాల్వేర్ ఉన్నట్లు డాక్టర్ వెబ్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. హువావే యాప్ గ్యాలరీలోని సుమారు 190పైగా యాప్‌ల ద్వారా 93 లక్షల మంది ఈ మాల్వేర్ను డౌన్లోడ్ చేసినట్లు పేర్కొంది. దీనిపై హువావేకు నివేదిక సమర్పించడంతోపాటు, వాటిని తొలగించేందుకు హువావేకు సహకరించినట్లు డాక్టర్ వెబ్ తెలిపింది. హ్యాకర్స్ Android.Cynos.7.origin అనే మాల్వేర్ను గేమింగ్ యాప్‌ల ద్వారా యూజర్స్ మొబైల్స్‌లోకి పంపినట్లు డాక్టర్ వెబ్ వెల్లడించింది.
యూజర్స్ గేమింగ్ యాప్‌లను డౌన్లోడ్ చేసిన తర్వాత ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు సంబంధించి కొన్ని అనుమతులు కోరుతుంది. యూజర్ అనుమతించిన వెంటనే ఫోన్‌కు వచ్చే టెక్ట్స్ మెసేజ్‌లు, డౌన్లోడ్ ఫైల్స్ వంటి వాటి ద్వారా యూజర్ సమాచారాన్ని సేకరిస్తుంది. తర్వాత యూజర్ ప్రమేయం లేకుండా ప్రీమియం ఎస్సెమ్మెస్ సేవలు, ఇతర యాప్‌లను ఫోన్లో ఇన్స్టాల్ చేసి బ్యాంక్ ఖాతాల నుంచి నగదు దొంగలిస్తున్నట్లు సమాచారం. 2014లోనే ఈ మాల్వేర్ వెర్షన్‌ను గుర్తించి తొలగించారు. తాజాగా హ్యాకర్స్ ఈ మాల్వేర్లో మార్పులు చేసి హువావే యాప్ గ్యాలరీ ద్వారా ఫోన్ నంబరు, డివైజ్ లొకేషన్, జీపీఎస్, వైఫై యాక్సెస్ పాయింట్ డేటా, మొబైల్ ఐడీ వంటి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నట్లు గుర్తించామని డాక్టర్ వెబ్ తెలిపింది.
హువావే యాప్ గ్యాలరీలోని మాల్వేర్ యాప్‌లను గుర్తించి వాటిని తొలగించినట్లు హువావే అధికార ప్రతినిధి తెలిపారు. అలానే ఈ యాప్‌లకు సంబంధించి వాటి డెవలపర్స్‌తో కూడా సంప్రదింపులు జరిపి త్వరలోనే మాల్వేర్ రహిత యాప్ వెర్షన్స్‌ను విడుదల చేస్తామని హువావే సంస్థ తెలిపింది. గత కొంత కాలంగా భారత మార్కెట్లో హువావే ఫోన్లు పరిమిత సంఖ్యలోనే విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో హువావే మొబైల్స్ ఉపయోగిస్తున్న యూజర్స్ తమ ఫోన్ల నుంచి ఈ జాబితాలోని యాప్‌లను వెంటనే తొలగించాలని సంస్థ సూచించింది.
యాప్‌ల జాబితా కోసం క్లిక్ చేయండి
► Read latest Gadgets & Technology News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.