Published : 31/01/2021 10:22 IST

ఆండ్రాయిడ్ 12 ఇలానే ఉంటుందా..! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆండ్రాయిడ్ ఓఎస్‌..గూగుల్‌ తీసుకొచ్చిన ఈ ఓఎస్‌తో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. అంతేకాదు యూజర్ అవసరాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తూ ప్రతి ఏడాది అప్‌డేటెడ్ వెర్షన్‌ని తీసుకొస్తున్నారు. గతేడాది ఆండ్రాయిడ్ 11లో ఛాట్ బబుల్స్‌, కన్వర్జేషన్‌ నోటిఫికేషన్స్, బిల్ట్‌-ఇన్ స్క్రీన్ రికార్డర్‌ వంటి కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేశారు. అలానే ఈ ఏడాది రానున్న ఆండ్రాయిడ్ 12 ఫీచర్స్‌ గురించి ఇప్పటికే నెట్టింట్లో వివిధ రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ 12ని ఎప్పుడు విడుదల చేస్తారు..ఎలాంటి ఫీచర్స్‌ ఉంటాయనేది చూద్దాం..

* గత నాలుగు సంవత్సరాలుగా ఆండ్రాయిడ్‌ కొత్త వెర్షన్లు ఆగస్టు, సెప్టెంబరుల్లో విడుదల చేశారు. అలానే ఈ ఏడాది కూడా ఆయా నెలల్లోనే ఆండ్రాయిడ్ 12ని విడుదల చేస్తారని భావించారు. అయితే ప్రస్తుతం ఎక్కువ మంది గూగుల్ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తుండటం..కొవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో అక్టోబరు లేదా నవంబరు నెలలో విడుదల చేస్తారని అంచనా.

* ఆండ్రాయిడ్ ఓఎస్‌ని పూర్తి స్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చే ముందు బీటా వెర్షన్‌ని విడుదల చేస్తారు. దీన్ని టెక్‌ నిపుణులు, కొద్ది మంది వినియోగదారులు పరీక్షిస్తారు. వారి సూచనల మేరకు మార్పులు ఏమైనా ఉంటే వాటిని సరిచేసి తర్వాత కొత్త వెర్షన్‌ను విడుదల చేస్తారు. ఎప్పడూ మే నెలలో బీటా వెర్షన్‌ తీసుకొస్తారు. గతేడాది కొవిడ్‌-19 దృష్ట్యా రెండు నెలలు ఆలస్యంగా జూన్‌ నెలలో విడుదల చేశారు. ఈ ఏడాది ఇది మరింత ఆలస్యం కావొచ్చని టెక్ వర్గాల అంచనా.

* ఈ సారి ఆండ్రాయిడ్ 12 పూర్తిగా గూగుల్ పిక్సె‌ల్ ఫోన్‌ను‌ దృష్టిలో పెట్టుకుని తీసుకొస్తున్నారు. ఇందులో పిక్సెల్‌ ఫోన్‌ వెనకవైపు డబుల్ ట్యాప్‌ చేస్తే కొన్ని రకాల ఫీచర్స్‌ ఓపెన్ అయ్యేలా షార్ట్‌కట్‌లను పరిచయం చేస్తారట. వాటిలో గూగుల్ అసిస్టెంట్, స్నూజ్‌ అలారమ్స్, స్క్రీన్‌ షాట్స్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. ఇవే కాకుండా యాప్‌ పెయిరింగ్, వైఫై పాస్‌వర్డ్ షేరింగ్ ఫీచర్స్‌, మీడియా ప్లేబ్యాక్‌ కంట్రోల్స్‌ కూడా ఇస్తున్నారనేది సమాచారం.

* అలానే ఆండ్రాయిడ్ ఓఎస్‌ విడుదలయినప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న మార్పులు మినహా యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ)లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ సారి యూఐలో కూడా కీలక మార్పులు చేస్తారని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గూగుల్ పిక్సెల్‌ ఫోన్లను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఓఎస్‌ ఉపయోగించే ఫోన్‌ కంపెనీలు ఆండ్రాయిడ్ యూఐలో మార్పులు చేసి సొంతగా యూఐను పరిచయం చేస్తున్నాయి. ఇప్పటికే శాంసంగ్ వన్‌ యూఐ, వన్‌ప్లస్‌ ఆక్సిజన్ ‌ఓఎస్‌, వివో ఫన్‌టచ్‌ ఓఎస్‌11 తమ సొంత యూఐను ఇస్తున్నాయి. మరి ఆండ్రాయిడ్ 12 కొత్త యూఐని మొబైల్ కంపెనీలు కొనసాగిస్తాయా లేక మార్పులు చేస్తాయా..తెలియాలంటే మరి కొద్ది నెలలు ఆగాల్సిందే.

ఇవీ చదవండి..

యాప్‌ పెయిర్స్‌: ఆండ్రాయిడ్ కొత్త ఫీచర్‌..

నియర్‌బై షేర్ తరహా..గూగుల్ కొత్త ఫీచర్

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని