WhatsApp: వాట్సాప్‌లో కొత్త షార్ట్‌కట్‌ ఆప్షన్‌.. దేనికోసమో తెలుసా?

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త షార్ట్‌కట్‌ ఆప్షన్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. గ్రూప్‌ క్రియేట్‌ చేసుకునేందుకు..

Updated : 11 May 2022 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త షార్ట్‌కట్‌ ఆప్షన్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. యూజర్ల వాట్సాప్‌ కాంటాక్ట్‌ సెక్షన్‌లోనే గ్రూప్‌లను క్రియేట్‌ చేసుకునేందుకు త్వరలో ‘క్రియేట్ గ్రూప్‌’ అనే కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని వాబీటాఇన్ఫో తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఈ షార్ట్‌కట్‌ ఆప్షన్‌ ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌ వెర్షన్‌ 2.22.10.4 బీటా యూజర్లకు అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.


ఎలా పనిచేస్తుంది?

వాబీటాఇన్ఫో తెలిపిన వివరాల ప్రకారం.. ‘క్రియేట్‌ గ్రూప్‌’ షార్ట్‌కట్‌ ఆప్షన్‌ అనేది కాంటాక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్షన్‌లో ఉంటుంది. కాంటాక్ట్‌ మీద క్లిక్‌ చేసి ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే ఆటోమెటిక్‌గా కొత్త గ్రూప్‌ క్రియేట్‌ అవుతుంది. అంతేకాకుండా ఇతర సభ్యులను గ్రూప్‌లో యాడ్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఇది అప్‌డేటెడ్‌ వాట్సాప్‌ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తుందని.. మిగతా యూజర్లకు కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తుందని తెలిపింది.


ఇదిలా ఉండగా.. మన ఫోన్‌లో అన్‌సేవ్‌డ్‌ కాంటాక్ట్‌తో సులువుగా చాట్‌ చేసుకునేందుకు వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. చాట్‌ పేజీలో ఫోన్‌ నంబర్‌పై క్లిక్‌ చేస్తే నేరుగా డయలర్‌ యాప్‌నకు వెళ్లేలా ఈ ఫీచర్‌ పనిచేయనుందని సమాచారం. ఇవేకాకుండా కొత్త నంబర్‌పై క్లిక్‌ చేయగానే ‘యాడ్‌ టూ కాంటాక్ట్స్‌’తో పాటు ‘డయిల్‌’ అనే ఆప్షన్స్‌ను వాట్సాప్‌ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే  ‘యాడ్‌ టూ కాంటాక్ట్స్‌’ అనే ఆప్షన్‌ కొంతమంది యూజర్లకు అందుబాటులోకి వచ్చిందని వాబీటాఇన్ఫో వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని