భలే... మీరు వాడకపోతే నిద్రపుచ్చుతుంది

స్టోరేజీ, డేటా, బ్యాటరీ యూసేజ్‌ తగ్గించడానికి ఆండ్రాయిడ్‌ కొత్త ఆలోచన... 

Updated : 15 Jan 2021 15:03 IST

కొత్త ‘ఆండ్రాయిడ్‌’లో అదిరిపోయే ఫీచర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఎప్పుడైనా అవసరం పడకపోతుందాని ఒక యాప్‌, అప్పుడెప్పుడో వాడిన మరో యాప్‌, రేపు వాడదాం అనుకునే ఇంకో యాప్‌, ఎవరో బాగుందన్నారని మరో యాప్‌... ఇలా స్మార్ట్‌ఫోన్స్‌లో చాలా యాప్స్‌ ఉంటూ ఉంటాయి. మీ మొబైల్‌లోనూ ఇంతేనా. వాడని యాప్స్‌ వల్ల మనకేం ఇబ్బంది అనుకొని అలానే ఉంచేసుంటారు. అయితే అలాంటి యాప్స్‌ మీ మొబైల్‌ డేటాను, బ్యాటరీని తినేస్తుంటాయి. త్వరలో ఈ సమస్య ఉండదు. ఎందుకంటే మీరు వాడని యాప్‌ను మీ మొబైల్‌ నిద్రపుచ్చేస్తుంది. 

కొత్త వెర్షన్‌ ఆండ్రాయిడ్‌ వచ్చినప్పుడల్లా... కొత్త ఫీచర్లు రావడం కామన్‌. అయితే 12 వ వెర్షన్‌ ఆండ్రాయిడ్‌లో వైవిధ్యమైన ఫీచర్‌ రాబోతోందట. అదే హైబర్‌నేషన్‌. తెలుగులో అర్థమయ్యేలా చెప్పాలంటే ‘నిద్రపోయేలా చేయడం’. మీరు మొబైల్‌లో చాలా రోజులు/సమయం నుంచి వాడని యాప్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో పని చేయకుండా చూడటం ఈ ఫీచర్‌ పని. అంటే ఉదాహరణకు ‘యువ’ అనే యాప్‌ను మీరు చాలా రోజుల నుంచి వాడటం లేదు. కానీ ఆ యాప్‌ మీ మొబైల్‌లో స్టోరేజీని తీసుకుంటుంది, బ్యాటరీని తీసుకుంటుంది, డేటాను కూడా తీసుకుంటుంది. హైబర్‌నేషన్‌ వచ్చాక ఈ పద్ధతి మారుతుంది. వాడని యాప్‌ నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోతుంది. దాని వల్ల మీ మొబైల్‌స్టోరేజీ, బ్యాటరీ, డేటా మిగులుతాయి. 

ఇదే తరహా ఫీచర్‌ కొన్ని ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో ఉంది. అయితే అవి కేవలం బ్యాటరీ యూసేజ్‌ను మాత్రమే ఆపగలుగుతున్నాయి. ఐవోఎస్‌లోనూ ఈ తరహా ఫీచర్‌ ఉంది. తరచుగా వాడని యాప్‌ నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోతుంది. మళ్లీ అవసరమైనప్పుడు యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌  అవుతుంది. మరి ఆండ్రాయిడ్‌లో ‘హైబర్‌నేషన్‌’ ఫీచర్‌ ఎలా పని చేస్తుందో చూడాలి. 

ఇవీ చదవండి...

ఈ ల్యాపీలు రేంజ్‌... వేరే లెవల్‌!

శాంసంగ్‌ ప్రాసెసర్‌..గేమింగ్ ఛైర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని