iPhone 12: ఐఫోన్‌ 12 వాడుతున్నారా..? అయితే మీకు ఆ సేవలు ఉచితం

ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో మాక్స్‌లోని ఆడియో సమస్యను పరిష్కరించనున్నట్లు యాపిల్ తెలిపింది. ఈ సేవలను యూజర్స్‌కి ఉచితంగా అందివ్వనున్నట్లు యాపిల్ వెల్లడించింది. 

Updated : 12 Aug 2022 12:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐఫోన్‌ 12, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌లో తలెత్తిన ఆడియో సమస్యను పరిష్కరించనున్నట్లు యాపిల్‌ ప్రకటించింది. దీనికి సంబంధించిన సర్వీసు సేవలను యూజర్స్‌కి ఉచితంగా అందివ్వనున్నట్లు తెలిపింది. ఐఫోన్ 12 సిరీస్‌లోని ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో మోడల్స్‌లో ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు ఆడియో సరిగా వినపడటంలేదని చాలా మంది యూజర్స్ యాపిల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన యాపిల్ 2020 అక్టోబరు నుంచి 2021 ఏప్రిల్ మధ్య తయారైన ఆడియో డివైజ్‌లలోని రిసీవర్ మాడ్యుల్స్‌లో ఈ సమస్య ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. వీటిలో ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో మాక్స్‌ డివైజ్‌లు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. దీంతో డివైజ్‌లలో సమస్య ఉన్న యూజర్స్‌కు ఉచితంగా రిసీవర్‌ మాడ్యుల్స్‌ని మార్చి ఇవ్వనున్నట్లు యాపిల్ ప్రకటించింది.

మరోవైపు కొత్త మోడల్స్‌ను రిలీజ్‌ చేసేందుకు యాపిల్‌ సిద్ధమవుతోంది. సెప్టెంబరు నెలలో యాపిల్‌ ఐఫోన్ 13 మోడల్స్‌ను తీసుకురానుంది. దానికంటే ముందే ఈ సమస్యను పరిష్కరించాలని యాపిల్ భావిస్తోంది. త్వరలో విడుదలకానున్న ఐఫోన్ 13 కూడా చూసేందుకు ఐఫోన్ 12 తరహాలోనే ఉన్నప్పటికీ కెమెరా, సెన్సర్, ప్రాసెసర్‌ పరంగా కీలక మార్పులు చేసినట్లు సమాచారం. ఐఫోన్ 13లోని ఫీచర్స్‌, ఇతర వివరాలు తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని