Apple: యాపిల్‌ ‘టెక్‌ పండుగ’ తేదీలు ఖరారు.. ఏమేం రాబోతున్నాయ్‌?

యాపిల్ కంపెనీ వరల్డ్‌వైడ్ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ తేదీలను ప్రకటించింది. మరి ఈ కార్యక్రమంలో యాపిల్ ఎలాంటి ఉత్పత్తులను పరిచయం చేయనుందనేది తెలియాలి. 

Published : 08 Apr 2022 01:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యాపిల్‌ కంపెనీ ఏటా నిర్వహించే వరల్డ్‌వైడ్ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ (WWDC) తేదీలను 2022 సంవత్సరానికి ఖరారు చేసింది. జూన్‌ 6 నుంచి జూన్ 10 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. వర్చువల్‌గా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో యాపిల్ కొత్త ఓఎస్‌ ఐఓఎస్‌ 16, ఐఫోన్‌ 14 సిరీస్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం. వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో యాపిల్‌ భవిష్యత్తులో తీసుకురాబోయే ఐఓఎస్‌, ఐపాడ్‌ ఓఎస్‌, మాక్‌ ఓఎస్‌, వాచ్‌ఓఎస్‌, టీవీఓఎస్‌లకు అనుగుణంగా యాప్‌లు ఎలా రూపొందించాలనేది యాప్‌ డెవలపర్స్‌కు తెలియజేస్తారు. అలానే డబ్ల్యూడబ్ల్యూడీసీ 2022లో హై-ఎండ్‌ ఎమ్‌1 అల్ట్రా చిప్‌తో తీసుకురానున్న కొత్త మాక్‌ ప్రో కంప్యూటర్‌ను యూజర్లకు పరిచయం చేస్తారని తెలుస్తోంది. 

గత రెండేళ్లుగా యాపిల్ కంపెనీ విద్యార్థులు రూపొందించే యాప్‌లపై దృష్టి సారిస్తోంది. అలానే ప్రస్తుత జీవనశైలికి అనుగుణంగా విద్యార్థులు యాప్‌లు డెవలప్‌ చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ఏటా డబ్ల్యూడబ్ల్యూడీసీలో ప్రత్యేకంగా స్విఫ్ట్‌ స్టూడెంట్‌ ఛాలెంజ్‌ను నిర్వహిస్తోంది. ఇందులో ప్రపంవ్యాప్తంగా ఉన్న అనేకమంది విద్యార్ధులు ఐపాడ్‌, మ్యా్‌క్‌ కోసం రూపొందించిన యాప్‌లతో పాల్గొంటారు. 

ఇప్పటికే ఐఫోన్‌ 14 సిరీస్ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్లలో 48 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుందని సమాచారం. దీంతో 8K రిజల్యూషన్‌ వీడియో రికార్డు చేయొచ్చట. సాధారణ సిమ్‌కార్డ్‌కు బదులు ఇందులో ఈ-సిమ్‌ ఫీచర్‌ ఇస్తున్నారని తెలుస్తోంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో ప్రో మోషన్ నాచ్‌లెస్‌ డిస్‌ప్లే ఉంటుందని సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని