Updated : 12 Aug 2022 15:34 IST

iPhone 14: యాపిల్‌ ఐఫోన్ 14 సిరీస్‌‌.. కొత్త అప్‌డేట్స్‌ ఇవే!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐఫోన్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్‌ 14 సిరీస్‌ సెప్టెంబరు 13న విడుదల కానుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫీచర్స్‌ కొన్ని నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఐఫోన్‌ 14 సిరీస్‌లో ఎన్ని మోడల్స్‌ రానున్నాయి? ఎలాంటి ఫీచర్లుంటాయనేది చూద్దాం.

ఐఫోన్ 14 సిరీస్‌  

ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు మోడల్స్‌ రానున్నాయి. ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 మాక్స్‌, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి. టెక్‌ వర్గాల సమాచారం ప్రకారం ఈ సారి ఐఫోన్‌ 14 సిరీస్‌లో మినీ మోడల్‌ను నిలపివేస్తున్నారట. ఐఫోన్‌ 12, ఐఫోన్ 13 సిరీస్‌లో మినీ మోడల్స్‌ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.   

 డిజైన్‌ & ఫీచర్లు

ఐఫోన్‌ 13 తరహాలోనే ఈ మోడల్‌లో పెద్ద స్క్రీన్‌ ఇస్తున్నట్లు సమాచారం. మాక్స్‌లో నాచ్‌లెస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారట. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.1 అంగుళాలు (ఐఫోన్‌ 14, ఐఫోన్ 14 ప్రో), 6.7 అంగుళాల (ఐఫోన్‌ 14 మాక్స్‌, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌) డిస్‌ప్లే ఇస్తున్నట్లు సమాచారం. వెనుకవైపు రెండు కెమెరాలు, ముందు ఒక కెమెరా ఉంటాయని తెలుస్తోంది. వీటిలో పిక్సెల్ బిన్నింగ్‌ కెమెరా టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇది తక్కువ లైట్ ఉన్నప్పుడు కూడా అత్యుత్తమ క్వాలిటీ ఫొటోలను అందిస్తుంది. దీని సాయంతో 8K వీడియోలను రికార్డు చేయొచ్చు. వీటిలో ఈ-సిమ్‌ ఫీచర్‌ ఇస్తున్నారట. ఐఫోన్ 13 తరహాలోనే వీటిలో కూడా శాటిలైట్ నెట్‌వర్క్ కనెక్టివిటీ ఫీచర్‌ ఉంటుందట. 

ఐఫోన్‌ 14 సిరీస్‌లో  ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది ఐఫోన్‌ 13లో ఉపయోగించిన ఏ15 బయోనిక్‌ ప్రాసెసర్‌కు అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌. ఐఓఎస్‌ 16 ఓఎస్‌తో పనిచేస్తాయి. ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో 8 జీబీ ర్యామ్‌, ఐఫోన్‌ 14 మోడల్స్‌లో 6జీబీ ర్యామ్‌తో పనిచేస్తాయని తెలుస్తోంది. ఐఫోన్‌ 14 సిరీస్‌ ప్రారంభ ధర 799 డాలర్ల నుంచి 899 డాలర్లు ఉండొచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా. భారత కరెన్సీలో సుమారు `₹ 64,000 నుంచి ₹ 71,500. 

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని